SRH vs LSG: షమీ మాయాజాలం, పంత్‌ కెప్టెన్ ఇన్నింగ్స్.. సొంత మైదానంలో లక్నో చేతిలో సన్‌రైజర్స్ దారుణ ఓటమి!

LSG Beat SRH in IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) అద్భుత విజయాన్ని అందుకుంది.

Rishvik
Published on: 5 April 2026 9:51 PM IST
SRH vs LSG 2026: Rishabh Pant Leads Lucknow to Win, Shami Shines
X

SRH vs LSG 2026

LSG Beat SRH in IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) అద్భుత విజయాన్ని అందుకుంది. లీగ్ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన ఎల్ఎస్‌జీ.. రెండో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలిచింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. లక్నో విజయంలో కెప్టెన్ రిషభ్‌ పంత్‌ (68 నాటౌట్), ఐడెన్ మార్‌క్రమ్‌ (45) కీలక పాత్ర పోషించారు. అంతకుముందు మహ్మద్ షమీ మాయాజాలంతో ఎస్‌ఆర్‌హెచ్ టాప్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. హైదరాబాద్‌ బౌలర్లలో హర్ష్‌ దూబె 2 వికెట్లు పడగొట్టాడు.

లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు సరైన ఆరంభం దక్కలేదు . ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (14) నిరాశపరిచాడు. వన్ డౌన్‌లో వచ్చిన రిషభ్‌ పంత్‌తో కలిసి మార్‌క్రమ్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలకు పంపారు. ఈ క్రమంలో 40 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. జట్టు స్కోర్ 77 పరుగుల వద్ద మార్‌క్రమ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఆపై స్వల్ప వ్యవధిలోనే ఆయుష్ బదోని (12), నికోలస్ పూరన్‌ (1) పెవిలియన్‌కు చేరారు. దీంతో లక్నో కష్టాల్లో పడగా.. సన్‌రైజర్స్‌ రేసులోకి వచ్చింది. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ బాదాడు. కీలక సమయంలో అబ్దుల్‌ సమద్‌ (16) అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో లక్నో విజయానికి 9 పరుగులు చేయాల్సిన వచ్చింది. తొలి రెండు బంతులకు వరుసగా 2 ఫోర్లు బాదిన పంత్.. ఐదవ బంతికి ఫోర్‌ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో క్లాసెన్‌ (62), నితీశ్‌ రెడ్డి (56) హాఫ్ సెంచరీలు బాదారు. అభిషేక్‌ శర్మ (0), ట్రావిస్‌ హెడ్ (7), ఇషాన్‌ కిషన్‌ (1), లివింగ్‌స్టన్‌ (14) విఫలమయ్యారు. ఎల్ఎస్‌జీ బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ 35 పరుగులు మాత్రమే చేసింది. 11వ ఓవర్ నుంచి క్లాసెన్‌, నితీశ్‌ గేర్ మార్చారు. వరుస ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో హైదరాబాద్‌ పోరాడే స్కోర్ చేసింది. ఎల్ఎస్‌జీ బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story