కావ్య మారన్‌కు ఆయనంటే ఇష్టం.. ప్లేయింగ్ ఎలెవన్‌లో అతను ఉండాల్సిందే!
Kavya Maran: గతేడాది జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఏకంగా 13 కోట్ల భారీ ధర వెచ్చించి లియామ్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకుంది.
కావ్య మారన్‌కు ఆయనంటే ఇష్టం.. ప్లేయింగ్ ఎలెవన్‌లో అతను ఉండాల్సిందే!
Kavya Maran: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా, దీనికి సంబంధించిన వివాదాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసినా తమకు సరైన అవకాశాలు ఇవ్వలేదని కొందరు విదేశీ ఆటగాళ్లు ఇప్పుడు నోళ్లు విప్పుతున్నారు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీపై, ఆ జట్టు యజమాని కావ్య మారన్‌పై ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు: అసలేం జరిగింది?
గతేడాది జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఏకంగా 13 కోట్ల భారీ ధర వెచ్చించి లియామ్ లివింగ్‌స్టోన్‌ను సొంతం చేసుకుంది. లోయర్ ఆర్డర్‌లో మెరుపు వేగంతో పరుగులు రాబడుతూ, స్పిన్ బౌలింగ్‌తోనూ ఉపయోగపడతాడని ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ సీజన్ మొత్తంలో లివింగ్‌స్టోన్‌కు దక్కింది కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే.
ఒకానొక దశలో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేనప్పుడు కూడా హైదరాబాద్ జట్టు కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది తప్ప, లివింగ్‌స్టోన్‌ను వైపు కన్నెత్తి చూడలేదు. ఇంతటి వివక్షకు గల అసలు కారణాన్ని తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో లివింగ్‌స్టోన్ బయటపెట్టాడు.
యజమాని మెచ్చిన ఆటగాడే ముఖ్యం.. హెడ్ కోచ్ షాకింగ్ సమాధానం..
ప్రముఖ క్రికెట్ పాడ్‌కాస్ట్ 'స్టిక్ టు క్రికెట్'లో సర్ అలిస్టర్ కుక్, మైఖేల్ వాన్ వంటి దిగ్గజాలతో మాట్లాడుతూ లివింగ్‌స్టోన్ సంచలన నిజాలు వెల్లడించాడు.
"ఐపీఎల్‌లో మూడు రకాల ఆటగాళ్లు ఉంటారు. మొదటి రకం జట్టులో ఖచ్చితంగా స్థానం ఉన్నవారు, రెండో రకం జట్టులో వస్తూ పోతూ ఉండేవారు, మూడో రకం నాలాంటి వారు.. ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాలు రానివారు." అని వ్యాఖ్యానించాడు.
మరింత లోతుగా మాట్లాడుతూ.. "వేలంలో ముంబై ఇండియన్స్‌తో పోటీపడి మరీ ఎస్‌ఆర్‌హెచ్ ఒక ఆటగాడిని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎందుకంటే ఫ్రాంచైజీ ఓనర్‌కు (కావ్య మారన్) ఆ ఆటగాడంటే చాలా ఇష్టం. దాంతో ఆ ఆటగాడి స్థానం జట్టులో ఖాయమైపోయింది. పాట్ కమిన్స్ లేనప్పుడు ముగ్గురు విదేశీ ప్లేయర్లతోనే ఎందుకు ఆడుతున్నామని నేను హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరిని నేరుగా అడిగాను. దానికి ఆయన స్పందిస్తూ.. 'ఫ్రాంచైజీ యజమానికి ఆ ప్లేయర్ అంటే ఇష్టం, కమిన్స్ వచ్చాక కూడా మార్పులు ఉండవు' అని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది, ఎవరికైనా గాయమైతే తప్ప నాకు అవకాశం రాదని" అంటూ లివింగ్‌స్టోన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కావ్య మారన్ టార్గెట్‌గా విమర్శలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ స్టేడియంలో సందడి చేస్తూ, జట్టును ఎంతో ఉద్వేగంగా సపోర్ట్ చేసే కావ్య మారన్‌పై లివింగ్‌స్టోన్ నేరుగా పేరు ఎత్తకుండానే పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశాడు. కేవలం ఓనర్ వ్యక్తిగత ఇష్టాయిష్టాల వల్లే జట్టు ఎంపిక జరుగుతోందని, ప్రతిభ ఉన్నా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోందని అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సీజన్‌లో ఏప్రిల్ 5న లక్నోపై (14 పరుగులు), ఏప్రిల్ 18న చెన్నైపై (1 పరుగు) మాత్రమే అతడికి అవకాశం లభించింది.
క్రికెట్ అనేది పూర్తిగా ప్రతిభ, వ్యూహాల ఆధారంగా సాగాల్సిన ఆట. కానీ ఐపీఎల్ లాంటి భారీ లీగ్‌లలో ఫ్రాంచైజీల యజమానుల జోక్యం, వారి వ్యక్తిగత నిర్ణయాలు ఆటగాళ్ల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయనేదానికి లియామ్ లివింగ్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. మరి ఈ వివాదంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం లేదా కావ్య మారన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.




