Sara Tendulkar: సారా టెండూల్కర్ సంచలన పోస్ట్.. మీకు సిగ్గులేదంటూ..డిలీట్ చేసినా వదల్లేదుగా..!
Sara Tendulkar: ముంబై ఎయిర్‌పోర్టులో తనను వీడియో తీసి, అసభ్యకరంగా బాడీ షేమింగ్ క్యాప్షన్ పెట్టిన ఒక పాపరాజీ పేజీపై సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Sara Tendulkar: సారా టెండూల్కర్ సంచలన పోస్ట్.. మీకు సిగ్గులేదంటూ..డిలీట్ చేసినా వదల్లేదుగా..!
Body Shaming: సెలబ్రిటీలు కనిపిస్తే చాలు కెమెరాలతో వెంటపడటం.. వారి ప్రతి కదలికను రికార్డ్ చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం ఒక స్టార్ డాటర్‌పైనే అత్యంత అసభ్యకరంగా బాడీ షేమింగ్‌కు పాల్పడితే.. ఆమె ఊరుకుంటుందా? క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తనపై జరిగిన బాడీ షేమింగ్‌పై విశ్వరూపం చూపించారు. సోషల్ మీడియా వేదికగా ఓ పాపరాజీ పేజీకి ఆమె ఇచ్చిన ఘాటు కౌంటర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ఇటీవల సారా టెండూల్కర్ తన వదిన సానియాతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. సెలబ్రిటీలను కవర్ చేసే ఒక ఫోటోగ్రాఫర్ వారిద్దరినీ కెమెరాలో బంధించాడు. ఇక్కడివరకు అంతా మామూలుగానే ఉన్నా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు సదరు అకౌంట్ నిర్వాహకుడు తన వక్ర బుద్ధిని బయటపెట్టాడు. అత్యంత అభ్యంతరకరమైన, బాడీ షేమింగ్‌కు సంబంధించిన క్యాప్షన్‌ను ఆ వీడియోకు జత చేశాడు. సారా, సానియాల బాడీ షేప్‌ను ఉద్దేశిస్తూ రాసిన ఆ అసహ్యకరమైన లైన్స్ సోషల్ మీడియాలో సారా దృష్టికి వెళ్లాయి. అంతే.. ఆమె ఒక్కసారిగా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ అభ్యంతరకర పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. సారా టెండూల్కర్ ఆ ఫోటోగ్రాఫర్ అకౌంట్‌ను నడిరోడ్డుపై నిలబెట్టారు. మీరు చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం జర్నలిజం అనిపించుకోదు. వ్యూస్ కోసం ఇంత దిగజారుతారా? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి, మమ్మల్ని వదిలేయండి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సారా టెండూల్కర్ రేంజ్ ఏంటో, ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో తెలిసిందే. ఆమె అంతలా ఫైర్ అయ్యేసరికి సదరు పాపరాజీ పేజీ నిర్వాహకులు భయపడిపోయారు. నెటిజన్ల నుంచి ఎక్కడ ట్రోలింగ్ వస్తుందో అని భయంతో వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసేశారు. కానీ, సారా అంతటితో శాంతించలేదు. పోస్ట్ డిలీట్ చేసినంత మాత్రాన మీ తప్పు చెరిగిపోదంటూ సదరు అకౌంట్‌ను మళ్లీ ట్యాగ్ చేస్తూ మరో పవర్ ఫుల్ పంచ్ ఇచ్చారు. మీరు మీ పోస్ట్‌ను డిలీట్ చేసి ఉండొచ్చు.. కానీ అది మీలోని అసహ్యకరమైన ఆలోచనా విధానాన్ని ఏమాత్రం మార్చలేదు అంటూ సారా ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.




