Sanju Samson: అయ్యా బాబోయ్.. కోహ్లీ టిప్స్ ఫాలో కావడం నా వల్ల కాలేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson: టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Sanju Samson: అయ్యా బాబోయ్.. కోహ్లీ టిప్స్ ఫాలో కావడం నా వల్ల కాలేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
Sanju Samson: టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తనకు ఇచ్చిన ఫిట్నెస్, లైఫ్‌స్టైల్ సూచనలను దీర్ఘకాలం ఫాలో అవ్వడం తన వల్ల కాలేదని చెప్పాడు. దాదాపు ఏడాదిన్నర పాటు కోహ్లీ టిప్స్ పాటించినప్పటికీ.. ఆ తర్వాత అదే క్రమశిక్షణను కొనసాగించడం తన వల్ల కాలేదని వెల్లడించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన కెరీర్ కోసం విరాట్ చెప్పిన సలహాలు, సూచనలు తనపై ఎంతో ప్రభావం చూపాయని ఈ కేరళ ఆటగాడు పేర్కొన్నాడు.
తాజాగా జియోస్టార్ 'బిలీవ్' కార్యక్రమంలో మాట్లాడిన సంజు శాంసన్.. భారత జట్టు శిక్షణ శిబిరంలో విరాట్ కోహ్లీతో కలిసి జిమ్‌లో వ్యాయామం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. 'విరాట్ భాయ్ ఏ ఆటగాడితో అయినా చాలా స్పష్టంగా, ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఏ పని చేయాలన్నా ఎలా చేయాలో కచ్చితంగా చెబుతాడు. ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపిస్తాడు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా కలిసిపోతాడు. జిమ్‌లో ఆయన చూపించే అంకితభావం, కసి నన్నెప్పుడూ ఆకట్టుకుంటాయి. ఒకసారి జిమ్‌లో కలిసి వర్కౌట్ చేస్తున్నప్పుడు పాజీ నేను కూడా మంచి ఆటగాడిగా ఎదగాలంటే ఏం చేయాలి?' అని అడిగాను' అని సంజు తెలిపాడు.
కింగ్ కోహ్లీ ఇచ్చిన సమాధానాన్ని సంజు శాంసన్ వివరించాడు. 'అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎక్కువ కాలం రాణించాలంటే లైఫ్‌స్టైల్ చాలా ముఖ్యమని విరాట్ చెప్పాడు. ఏ ఆహారం శరీరానికి ఉపయోగపడుతుంది, ఏది రికవరీకి సహాయపడుతుంది, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలో వివరించాడు. పదేళ్ల పాటు ఇదే విధంగా కొనసాగిస్తే గొప్ప కెరీర్ ఉంటుందని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా నేను ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు పాటించాను. కానీ ఆ తర్వాత అదే క్రమశిక్షణను కొనసాగించడం నా వల్ల కాలేదు. కోహ్లీ మాత్రం ఏళ్లుగా అదే చేస్తున్నాడు. ఆయన అంకితభావంకు టేక్ ఏ బో' అని నిజాయితీగా వెల్లడించాడు.
టీ20 ప్రపంచ కప్‌కు ముందు తన ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిందని సంజు శాంసన్ తెలిపాడు. భారత క్రికెట్లో ఎప్పుడూ కొనసాగే పోటీ లేదా "ర్యాట్ రేస్"లో భాగం కావాలని తాను అనుకోవడం లేదని చెప్పాడు. జట్టులో చోటు దక్కినా, దక్కకపోయినా ఆటను ఆస్వాదిస్తూ తన నిబంధనల ప్రకారమే క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. 2028 టీ20 ప్రపంచ కప్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని కూడా స్పష్టం చేశాడు. జట్టుకు తన అవసరం ఉంటే, తాను మంచి ప్రదర్శన చేస్తే అవకాశాలు సహజంగానే వస్తాయని.. లేకపోయినా ఇప్పటికే సాధించిన విజయాల పట్ల తాను ఎంతో సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉంటానని చెప్పాడు. కోహ్లీ నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ తన కెరీర్లో విలువైన పాఠమని.. అయితే చివరికి ప్రతి ఆటగాడు తన వ్యక్తిత్వానికి, తన శైలికి అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని సంజు అభిప్రాయపడ్డాడు.




