Sanju Samson: చేసింది 11 పరుగులే అయినా.. అరుదైన ఘనత అందుకున్న సంజు!

Sanju Samson: టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.

Rishvik
Published on: 26 April 2026 4:31 PM IST
Sanju Samson
X

Sanju Samson: చేసింది 11 పరుగులే అయినా.. అరుదైన ఘనత అందుకున్న సంజు!

Sanju Samson: టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో 5000 రన్స్ పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 5 వేల రన్స్ పూర్తి చేసిన 10వ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న శాంసన్..

ఈరోజు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌పై మూడో పరుగు పూర్తయ్యాక ఈ ఘనత సాధించాడు. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంజు.. ఇప్పటివరకు 180 ఇన్నింగ్స్‌లోనే 5,000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, ఎంఎస్ ధోని, ఎబి డివిలియర్స్, కెఎల్ రాహుల్ ఇప్పటికే 5 వేల రన్స్ చేశారు.

సంజు శాంసన్ తన కెరీర్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ప్రారంభించాడు. మధ్యలో రెండు సీజన్లు (2016-17)ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాతినిధ్యం వహించి.. మళ్లీ రాజస్థాన్‌కు చేరుకున్నాడు. 2026 ఐపీఎల్ వేలానికి ముందు చెన్నై అతడిని ట్రేడ్ ద్వారా తీసుకోవడం విశేషం.

సంజు గణాంకాలు చూస్తే నిలకడ స్పష్టంగా కనిపిస్తుంది. అతడి సగటు సుమారు 31 కాగా.. స్ట్రైక్ రేట్ 140కు పైగా ఉంది. ఐపీఎల్‌లో 31 అర్ధ శతకాలు, 5 శతకాలు సాధించాడు. 4,000కుపైగా పరుగులు రాజస్థాన్ జట్టుకు ఆడుతూ చేయడం.. ఆ జట్టుతో అతడికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. 149 మ్యాచ్‌లలో 4,027 పరుగులు (సగటు 31.70) నమోదు చేశాడు.

సంజు శాంసన్ శతకాలలో మూడు (రాజస్థాన్ తరఫున రెండు) మూడో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేస్తూ రావడం విశేషం. 2024 సీజన్ శాంసన్ కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది. ఆ సీజన్‌లో మొదటిసారి 500కు పైగా పరుగులు చేశాడు. మొత్తం 531 పరుగులతో 48.27 సగటుతో ముగించాడు. ప్రస్తుతం 2026 సీజన్‌లో కూడా అతను అదే దూకుడు కొనసాగిస్తున్నాడు.

కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 300కు పైగా పరుగులు చేసి.. 50కు పైగా సగటు, సుమారు 178 స్ట్రైక్ రేట్‌తో అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో చేసిన రెండు 50+ స్కోర్లను కూడా శతకాలుగా మార్చడం అతని ఫామ్‌కు నిదర్శనం. గుజరాత్ మ్యాచులో సంజు 11 పరుగులే చేశాడు. ఐపీఎల్‌లో 5000 పరుగులు చేయడానికి సంజు అతి తక్కువ బంతులు ఆడాడు.

ఐపీఎల్‌లో 5000 పరుగులు చేయడానికి ఆడిన బంతులు:

3288 ఏబీ డివిలియర్స్

3554 డేవిడ్ వార్నర్

3555 సంజు శాంసన్

3620 సురేష్ రైనా

3688 కేఎల్ రాహుల్

3691 ఎంఎస్ ధోని

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story