Rohit Sharma: కోహ్లీ రేర్ రికార్డు బ్రేక్.. ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్!

Rohit Sharma: ముంబై ఇండియన్స్ (ఎంఐ) స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Rishvik
Published on: 5 May 2026 7:38 PM IST
Rohit Sharma
X

Rohit Sharma: కోహ్లీ రేర్ రికార్డు బ్రేక్.. ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్!

Rohit Sharma: ముంబై ఇండియన్స్ (ఎంఐ) స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడడంతో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 277 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్ 7267 రన్స్ చేశాడు, ఇందులో రెండు శతకాలు, 49 అర్ధ శతకాలు ఉన్నాయి. రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 109 నాటౌట్.

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందువరకు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో (276 మ్యాచ్‌లు) సమానంగా రోహిత్ శర్మ ఉన్నాడు. నిన్న మైదానంలోకి దిగడంతో హిట్‌మ్యాన్ కోహ్లీ రేర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ మొదటి స్థానంలో ఉన్నాడు. మహీ ఇప్పటివరకు 278 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఈ సీజన్‌లో ధోనీ గాయంతో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో త్వరలోనే రోహిత్, కోహ్లీ ఇద్దరూ అతన్ని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. రవీంద్ర జడేజా (264), దినేష్ కార్తీక్ (257) టాప్ 5లో ఉన్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. వాంఖడే స్టేడియంలో లక్నో జరిగిన ఈ పోరులో రోహిత్ శర్మ తన క్లాసిక్ షాట్లతో అభిమానులను అలరించాడు. పుల్ షాట్లు, ఫ్లిక్స్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి ర్యాన్ రికెల్టన్‌తో కలిసి భారీ భాగస్వామ్యం జట్టు విజయంలో కీలకంగా మారింది. రోహిత్ ఔటైన తర్వాత కాస్త ఒత్తిడి పెరిగినప్పటికీ.. చివర్లో జట్టు లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. కేవలం 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 228/5 స్కోర్ చేసింది. నికోలస్ పూరన్ (63) ధాటిగా ఆడగా.. మిచెల్ మార్ష్ (44) మంచి ఆరంభం ఇచ్చాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. ఆ తరువాత ఐడెన్ మార్క్రామ్ (31), హిమ్మత్ సింగ్ (40) కీలక రన్స్ చేశారు. ముంబై బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్:

ఎంఎస్ ధోనీ (278 మ్యాచ్‌లు)

రోహిత్ శర్మ (277 మ్యాచ్‌లు)

విరాట్ కోహ్లీ (276 మ్యాచ్‌లు)

రవీంద్ర జడేజా (264 మ్యాచ్‌లు)

దినేష్ కార్తీక్ (257 మ్యాచ్‌లు)

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story