Rohit Sharma: రోహిత్ శర్మ రనౌట్ .. గ్రౌండ్‌లోనే శుభ్‌మన్ గిల్‌పై ఫైర్..!
Rohit Sharma: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ రనౌట్ .. గ్రౌండ్‌లోనే శుభ్‌మన్ గిల్‌పై ఫైర్..!
Shubman Gill: భారత క్రికెట్ అభిమానులందరి మనసులో ఇప్పుడున్న ఒకే ఒక్క కోరిక.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని. ఆ మెగా టోర్నీపై ఉన్న గురితోనే వారిద్దరూ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. అయితే, వరల్డ్ కప్ రూట్ అనుకున్నంత ఈజీగా సాగేలా కనిపించడం లేదు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బరిలోకి దిగడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. తమకు ఇష్టమైన వన్డే ఫార్మాట్లో రోహిత్ మళ్లీ పరుగుల వరద పారిస్తాడని ఆశించారు. కానీ, మొదటి వన్డేలోనే అభిమానుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు పడ్డాయి.
ఆఫ్ఘాన్ తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మంచి ఊపుమీద కనిపించాడు. పాత హిట్ మ్యాన్ గుర్తొస్తున్నాడనుకునే లోపే.. 16 బంతుల్లో 16 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. శుభ్‌మన్ గిల్ వల్లే రోహిత్ అవుట్ అయ్యాడని కొందరు అంటుంటే.. లేదు, ఫీల్డర్ అడ్డురావడం వల్లే గిల్ క్రీజ్ వదిలి రాలేకపోయాడని మరికొందరు విశ్లేషిస్తున్నారు. నిజానికి గిల్‌కు ఆఫ్ఘాన్ ప్లేయర్ అడ్డుపడకుండా ఉంటే రన్ పూర్తయ్యేదని, కాబట్టి ఇక్కడ రోహిత్, గిల్.. ఇద్దరిదీ తప్పు కాదని మెజారిటీ క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తప్పు ఎవరిదైనా.. రోహిత్ తక్కువ స్కోరుకే వెనుతిరగడాన్ని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అవుట్ అయి వెళ్లే సమయంలో గిల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు రోహిత్.
రోహిత్ శర్మ ఇలా దురదృష్టవశాత్తు అవుట్ అయినప్పటికీ.. ఇప్పుడు టీమిండియా క్యాంప్‌లో ఉన్నది గౌతమ్ గంభీర్ అనే విషయం ఇక్కడ హాట్ టాపిక్‌గా మారింది. గంభీర్ కోచింగ్ స్టైల్ ఏంటో అందరికీ తెలిసిందే. టీమ్‌కు భారం అనిపిస్తే ఎంతటి పెద్ద ప్లేయర్నైనా పక్కన పెట్టడానికి వెనుకాడని మొండిఘటం ఆయన. పైగా ఇండియన్ క్రికెట్లో స్టార్ కల్చర్‌కు స్వస్తి పలికి, కేవలం ఫామ్, ఫిట్నెస్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలనేది గంభీర్ పాలసీ.
ప్రస్తుతం రోహిత్ శర్మకు వయసుతో పాటు ఫిట్నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి తోడు జట్టులో చోటు కోసం యువ ఆటగాళ్ల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. యంగ్ ప్లేయర్స్ అంతా అవకాశాల కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో సీనియర్లు పరుగులు చేయకపోతే.. ఎంతకాలం అని సీనియర్లను పట్టుకుని వేలాడుతారు? అనే విమర్శలు రావడం ఖాయం. గంభీర్ లాంటి కోచ్‌కు ఇలాంటి చిన్న పాయింట్ దొరికినా చాలు.. భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసేసుకుంటాడు.
ఈ రనౌట్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఆశలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ నిపుణులు. ఎందుకంటే 2027 నాటికి రోహిత్ వయసు మరింత పెరుగుతుంది, కాబట్టి ప్రతి ఇన్నింగ్స్ ఆయనకు లైఫ్ అండ్ డెత్ లాంటిదే. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మిగిలిన రెండు వన్డేలు హిట్ మ్యాన్‌కు అత్యంత కీలకంగా మారాయి. మరి ఈ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల నోళ్లు నొక్కడమే కాకుండా, గంభీర్ మార్క్ కత్తికి దొరకకుండా తన్ను తాను నిరూపించుకుంటాడో లేదో చూడాలి.




