RCB vs SRH: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే, తుది జట్లు ఇవే!

RCB vs SRH Toss Update: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు వేళయింది. లీగ్ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఎస్ఆర్‌హెచ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

Rishvik
Published on: 28 March 2026 7:26 PM IST
RCB vs SRH Toss Update: RCB Opt to Bowl First, Full Playing XI Revealed
X

RCB vs SRH Toss Update

RCB vs SRH Toss Update: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు వేళయింది. ఎం చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో ఆరంభం కానున్న లీగ్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్) టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఎస్ఆర్‌హెచ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

2016లో ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఎస్ఆర్‌హెచ్.. రెండో కప్పు గెలవాలని పట్టుదలతో ఉంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో టైటిల్‌ గెలుచుకున్న ఆర్‌సీబీ.. ట్రోఫీని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇరు జట్లలో హార్డ్‌ హిట్టర్లకు కొదవ లేదు. చిన్నస్వామి స్టేడియంలో బౌండరీ చిన్నదిగా ఉంటుంది కాబట్టి.. పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఇక్కడ టార్గెట్ 200+ స్కోర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లీగ్ తొలి మ్యాచ్‌ కాబట్టి ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ జట్లు విజయం సాధించాలని చూస్తున్నాయి. మరి గెలుపు ఎవరిదో చూడాలి.

ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ జట్లలో వీరి ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సన్‌రైజర్స్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్‌ కుమార్ దూకుడుగా ఆడనున్నారు. మరోవైపు ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, జాకబ్ బెతెల్, రొమారియో షెఫర్డ్‌తో బ్యాటింగ్‌ బలంగా ఉంది. ఆర్‌సీబీతో పోల్చితే ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, హర్ష దూబే జట్టులో ఉన్నారు.

తుది జట్లు:

ఎస్ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story