PSL 2026: డబ్ల్యూడబ్ల్యూఈ అరీనాగా పీఎస్ఎల్ 2026
PSL 2026: పీఎస్ఎల్ 2026లో రావల్పిండి ఇస్లామాబాద్ మ్యాచ్ లో ఫహీమ్ అష్రఫ్ అమీర్ పై ఆగ్రహంతో దూసుకెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది.
PSL 2026: డబ్ల్యూడబ్ల్యూఈ అరీనాగా పీఎస్ఎల్ 2026
Pakistan Super League: పాకిస్తాన్ సూపర్ లీగ్ 11వ సీజన్ నడుస్తోంది. అయితే ఈ పీసీబీ టీ20 లీగ్ ఆటగాళ్ల ప్రదర్శనల కంటే మైదానంలోని చేష్టల కారణంగానే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. సీజన్ ప్రారంభంలో జరిగిన ఒక మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణల తర్వాత ఫఖర్ జమాన్‌పై కొన్ని మ్యాచ్‌ల నిషేధం విధించారు. ఏప్రిల్ 23న రావల్పిండి, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) అరేనాలా కనిపించింది.అక్కడ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన మాజీ పాకిస్తానీ ఆటగాడు మహమ్మద్ అమీర్‌ను బ్యాట్‌తో కొట్టేంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఆమిర్ ను బ్యాట్ తో కొట్టిన ఫహీమ్..
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 34వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో రావల్పిండి, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్, 79 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కి చేరింది. బ్యాటింగ్ కు వచ్చిన ఆల్-రౌండర్ ఫహీమ్ అష్రఫ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు..కానీ మహమ్మద్ అమీర్ బౌలింగ్ లో ఒక భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి, 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ చేతికి చిక్కాడు.
ఆ తర్వాత మహమ్మద్ అమీర్ సంబరాలు చేసుకుని, ఫహీమ్ అష్రఫ్ ను మైదానం విడిచి వెళ్ళమని సైగ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఫహీమ్, తనను తాను నియంత్రించుకోలేక బ్యాట్ తో మహమ్మద్ అమీర్ వైపు దూసుకెళ్లాడు.
తోటి ఆటగాళ్లు రాకతో..
ఫహీమ్ అష్రఫ్ తన బ్యాట్‌ను ఊపుతూ మహమ్మద్ అమీర్ వైపు వేగంగా రావడం చూసి, ఇతర రావల్పిండి ఆటగాళ్లు పరిస్థితిని చక్కదిద్దడానికి జోక్యం చేసుకున్నారు, వారిలో ఒక ఆటగాడు ఫహీమ్‌ను ఆపడానికి ప్రయత్నించాడు. ఈ వాగ్వాదం సమయంలో అమీర్, అష్రఫ్‌ను మాటలతో దూషించడం కూడా కనిపించింది.




