Preity Zinta-PBKS: 'బ్యూటీ విత్ బ్రెయిన్'.. ప్రీతి జింటా బిజినెస్ మైండ్ అదుర్స్!
Preity Zinta’s Punjab Kings Growth Story: బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింటా అప్పట్లో వ్యాపార దృష్టితో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.
Preity Zinta-PBKS: 'బ్యూటీ విత్ బ్రెయిన్'.. ప్రీతి జింటా బిజినెస్ మైండ్ అదుర్స్!
Preity Zinta-PBKS: బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింటా సినీ ఇండస్ట్రీలోనే కాదు.. క్రికెట్ ప్రపంచంలో కూడా తన ముద్ర వేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ దశలోనే పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లలో ఆమె ఒకరు. 2008లో నెస్ వాడియా, కరణ్ పాల్, మోహిత్ బర్మన్ సహా ప్రీతి జింటా పంజాబ్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. అప్పట్లో వ్యాపార దృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సొట్టబుగ్గల సుందరికి ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది.
పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీలో ప్రీతి జింటా సుమారు 23 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే గత 18 ఏళ్లలో ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవకపోయినా.. ఆర్థికంగా మాత్రం ప్రాంచైజీ భారీగా ఎదిగింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ విలువ దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రీతి జింటా 2008లో సుమారు 35 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా.. ఇప్పుడు దాని విలువ రూ.3000 కోట్లకు పైగా పెరిగింది. అంటే సుమారు 8471 శాతం వృద్ధి సాధించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పెట్టుబడుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
ప్రీతి జింటా కేవలం అందంతోనే కాదు.. తెలివైన పెట్టుబడిదారిగా కూడా గుర్తింపు పొందారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నో కోట్లను తెచ్చిపెట్టింది. 35 కోట్ల రూపాయలు ఎక్కడ.. రూ.3000 కోట్లు ఎక్కడ అంటూ ఫాన్స్ షాక్ అవుతున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్, ప్రీతి జింటా బిజినెస్ మైండ్ అదుర్స్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్ మ్యాచ్ సమయంలో ప్రీతి జింటా స్టేడియంలో సందడి చేస్తుంటారు. ఆటగాళ్లను ఉత్సహపరుస్తూ.. తానూ ఎంజాయ్ చేస్తారు. మ్యాచులో బాగా ఆడిన ఆటగాడికి హగ్ ఇవ్వడం ఆమె స్పెషల్. ఇప్పటికే ఎందరో ఆటగాళ్లకు హగ్ ఇచ్చి నెట్టింట వైరల్ అయ్యారు.
ఐపీఎల్ 2024 వరకు పంజాబ్ కింగ్స్ ప్రయాణం సాఫీగా సాగలేదు. ఎప్పుడో తప్పితే ప్లే ఆఫ్స్ కూడా చేరుకునేది కాదు. అలాంటి టీమ్ శ్రేయాస్ అయ్యర్ సారథి అయ్యాక.. వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఐపీఎల్ 2025లో ఏకంగా ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే బెంగళూరు చేతిలో ఓడి నిరాశపరిచింది. ఈ ఏడాది కూడా దూసుకుపోతోంది. ఇప్పటివరకు టోర్నీలో 6 మ్యాచులు ఆడగా.. ఓటమనేది లేదు. పంజాబ్ జోరు చూస్తుంటే ఈసారి కూడా ఫైనల్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.




