National Sports Awards 2025: ఈ ఏడాది ఎవరికీ దక్కని ఖేల్‌రత్న.. 17 మంది క్రీడాకారులకు ‘అర్జున’ పురస్కారాలు!
National Sports Awards 2025: 2025 జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
National Sports Awards 2025: ఈ ఏడాది ఎవరికీ దక్కని ఖేల్‌రత్న.. 17 మంది క్రీడాకారులకు ‘అర్జున’ పురస్కారాలు!
National Sports Awards 2025: 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలను (National Sports Awards 2025) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 17 మంది క్రీడాకారులను ‘అర్జున అవార్డులు’ వరించాయి. అయితే, దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డును ఈ ఏడాది ఎవరికీ ప్రకటించకపోవడం విశేషం.
మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ, ఖేల్‌రత్న పురస్కారం కోసం హాకీ స్టార్ హార్దిక్ సింగ్ పేరును పరిశీలించినప్పటికీ.. చివరికి ఆయన ఆ రేసు నుంచి వైదొలగడంతో ఈ ఏడాది ఖేల్‌రత్నను ఎవరికీ ఖరారు చేయలేదు.
2025 అర్జున అవార్డు గ్రహీతలు:
అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి
బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్
బాక్సింగ్: నరేందర్ బెర్వాల్
చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్య దేశ్‌ముఖ్
హాకీ: లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్
కబడ్డీ: సుర్జీత్, పూజ
షూటింగ్: అఖిల్ షియోరాన్
పారా-షూటింగ్: ధనుష్ శ్రీకాంత్, రుద్రాంశ్ ఖండేల్వాల్
పారా-అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్
రోయింగ్: అరవింద్ సింగ్




