Bangladesh Vs Australia: చూసుకుందాం రా.. గ్రౌండ్‌లోనే బంగ్లాదేశ్- ఆసీస్ ఆటగాళ్ల మధ్య బిగ్ ఫైట్

Bangladesh Vs Australia: బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన ఘటనే చోటుచేసుకుంది.

Naresh.k
Updated on: 10 Jun 2026 10:57 AM IST
Bangladesh Vs Australia
X

Bangladesh Vs Australia: చూసుకుందాం రా.. గ్రౌండ్‌లోనే బంగ్లాదేశ్- ఆసీస్ ఆటగాళ్ల మధ్య బిగ్ ఫైట్

Nahid Rana Sledges Josh Inglis: క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం ఎంత మజా ఇస్తుందో.. ఆటగాళ్ల మధ్య జరిగే స్లెడ్జింగ్, మైండ్ గేమ్స్ కూడా అంతే మసాలా అందిస్తాయి. తాజాగా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఒక ఆసక్తికరమైన ఘటనే చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ స్పీడ్ స్టర్ నహీద్ రాణా.. ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లిస్‌ల మధ్య మాటల యుద్ధం నడవగా, కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంతో ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్రికెట్ పిచ్‌పై 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఫాస్ట్ బౌలర్లకు కాస్త దూకుడు ఎక్కువగానే ఉంటుంది. బంగ్లాదేశ్ యువ సంచలనం నహీద్ రాణా కూడా సరిగ్గా ఇదే దూకుడును ఆస్ట్రేలియా గడ్డపై చూపించాడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్‌తో రాణా పెట్టుకున్న మాటల యుద్ధం మ్యాచ్‌లోనే హైలైట్‌గా నిలిచింది.

మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో నహీద్ రాణా తన పదునైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే జోష్ ఇంగ్లిస్‌కు ఒక అద్భుతమైన డెలివరీ వేసిన తర్వాత.. రాణా అతడి వైపు చూస్తూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ ప్లేయర్లు సాధారణంగా స్లెడ్జింగ్‌లో కింగ్స్. దీంతో ఇంగ్లిస్ కూడా ఏమాత్రం తగ్గకుండా నహీద్ రాణాకు గట్టిగానే బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటల వేడి పెరిగి.. అది కాస్తా పెద్ద వివాదంగా మారేలా కనిపించింది. అంపైర్లు జోక్యం చేసుకునే లోపే మైదానంలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిపోయింది.

పరిస్థితి చేతులు దాటిపోతోందని గమనించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంతోవెంటనే రంగంలోకి దిగాడు. పరిగెత్తుకుంటూ వచ్చి జోష్ ఇంగ్లిస్, నహీద్ రాణాల మధ్యలో నిలబడ్డాడు. ఆవేశంలో ఊగిపోతున్న నహీద్ రాణాను వెనక్కి నెట్టి, అతడిని ప్రశాంతంగా ఉండాలంటూ హెచ్చరించాడు. అనవసర వివాదాలతో లైన్ అండ్ లెంగ్త్ దెబ్బతినకుండా బౌలర్‌ను కంట్రోల్ చేశాడు. మరోవైపు జోష్ ఇంగ్లిస్‌తో కూడా మాట్లాడి, పరిస్థితిని కూల్ చేశాడు.

కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఒక పెద్ద గొడవ జరగకుండా ఆగిపోయింది. రాణా లాంటి యంగ్ బ్లడ్‌కు మైదానంలో అగ్రెషన్ అవసరమే అయినా.. ఎక్కడ ఆగాలో తెలిసిన కెప్టెన్ ఉండటం జట్టుకు ఎంత ప్లస్ అవుతుందో శాంతో నిరూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ మధ్య తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story