MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. ఎంఎస్ ధోనీ ముందుగానే వచ్చేస్తున్నాడు!
MS Dhoni’s practice video Goes Viral: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు ఓ గుడ్‌న్యూస్. టీమిండియా దిగ్గజ ఆటగాడు, సీఎస్కే మాజీ కెప్టెన్ అనుకున్న దానికంటే ముందుగానే ఐపీఎల్ 2026లో ఆడే అవకాశాలు ఉన్నాయి
MS Dhoni
MS Dhoni’s practice video Goes Viral: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు ఓ గుడ్‌న్యూస్. టీమిండియా దిగ్గజ ఆటగాడు, సీఎస్కే మాజీ కెప్టెన్ అనుకున్న దానికంటే ముందుగానే ఐపీఎల్ 2026లో ఆడే అవకాశాలు ఉన్నాయి. రెండు వారాలు కాకుండా.. ఇంకా ముందుగానే మహీ మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు కారణం.. ధోనీ సీఎస్కే ప్రాక్టీస్‌లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే. అంతేకాదు ప్రాక్టీస్ చేయడానికి తలా తన కిట్‌ను తీసుకెళ్తోన్న వీడియోను సీఎస్కే పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన ధోనీ, సీఎస్కే ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 ఆరంభం ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఎంఎస్ ధోనీ రెండు వారాల పాటు దూరం అవుతున్నాడని సీఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మహీ సీఎస్కే ఆడే నాలుగైదు మ్యాచులు దూరం అవుతామని అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోస్ చక్కర్లు కొడుతుండడంతో.. మహీ అనుకున్న దానికంటే ముందుగానే మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి వరకూ కనీసం నాలుగు మ్యాచులకు దూరంగా దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు చెన్నై ఆడే మూడో మ్యాచ్‌కైనా తుది జట్టులోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. శుక్రవారం సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కాకపోయినా.. ఆపై మ్యాచ్‌లో అయినా మహీ ఆడే అవకాశాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఎంఎస్ ధోనీ తన కిట్‌బ్యాగ్‌తో నెట్ సెషన్‌కు వస్తూ.. కొన్ని బంతులను ఆడుతూ కనిపించాడు. దీనిపై అధికారికంగా ఫిట్నెస్ అప్డేట్ లేకపోయినా.. ప్రాక్టీస్‌లో పాల్గొనడం సీఎస్కేకు, అభిమానులకు ఊరట కలిగించింది. త్వరలోనే మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తాడనే ఆశలు పెరిగాయి. మరోవైపు సీఎస్కే తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసింది. గువాహటిలో జరిగిన ఆ మ్యాచ్‌లో జట్టు అన్ని విభాగాల్లో విఫలమైంది. యువ ఆటగాళ్లతో కూడిన సీఎస్కే జట్టు ఆ ఓటమిని మరిచి తిరిగి బలంగా రావాలని చూస్తోంది.
ఇక చెన్నై పిచ్ విషయానికి వస్తే.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది . రాబోయే ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎస్కే బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ధోనీ మార్గదర్శకత్వం కీలకం కానుంది. గాయంతో గువాహటి మ్యాచ్‌కు వెళ్లని ధోనీ.. ఇప్పుడు డగౌట్లో అయినా జట్టుకు సహాయం చేసే అవకాశముంది. ఈ సీజన్లో సీఎస్కే తరఫున సంజు తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. హోం గ్రౌండ్లో జరిగే మ్యాచ్‌లో అతను భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే డివాల్డ్ బ్రెవిస్ గాయంతో దూరంగా ఉండడం జట్టుకు మరో దెబ్బగా మారింది. బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ లాంటి బౌలర్లు గత మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయారు. వారు ఈ మ్యాచ్‌లో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. యువ ఆటగాళ్లు కార్తిక్ శర్మ వంటి వారు కూడా తమ ప్రతిభను నిరూపించుకోవాలి.




