MS Dhoni: సీఎస్కే అభిమానులకు భారీ షాక్.. క్రికెట్ దిగ్గజం రీఎంట్రీ లేనట్టే, ఇదే లాస్ట్?

MS Dhoni may miss IPL 2026. ఎంఎస్ ధోనీ ఆడడంపై చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సైమన్స్ స్పందించాడు.

Rishvik
Published on: 4 May 2026 5:42 PM IST
MS Dhoni
X

MS Dhoni

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఒకటే. అదే సీఎస్కే మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో ఆడతాడా లేదా?. వెటరన్ వికెట్‌కీపర్-బ్యాటర్ ఆ మధ్య జట్టుతో పాటే ప్రయాణించినప్పటికీ.. మైదానంలోకి మాత్రం బరిలోకి దిగలేదు. ఉప్పల్ మైదానంలో చెమటోడ్చడంతో మహీ ఆడుతాడని హైదరాబాద్ ఫాన్స్ సంబరపడ్డారు. తీరా చూస్తే.. ప్లేయింగ్ 11లో పేరు లేదు. కనీసం ఇంపాక్ట్ ఆటగాడిగా కూడా ఆడలేదు. ఇటీవల చెన్నై ఆడిన మ్యాచులలో మహీ కనిపించడం లేదు. దాంతో అటు ధోనీ, ఇటు సీఎస్కే అభిమానులు కంగారు పడుతున్నారు. లీగ్ దశ దగ్గరపడుతుండడంతో ధోనీ రీఎంట్రీ ఉంటుందా? అని అందరూ చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సైమన్స్ స్పందించాడు. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కాల్ఫ్ గాయం నుంచి కోలుకుంటున్నప్పటికీ.. ఇంకా పూర్తిగా ఫిట్ లేడని వెల్లడించాడు. మంగళవారం (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్‌తో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు ధోనీ జట్టుతో కలిసి ప్రయాణించలేదని స్పష్టం చేశాడు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సైమన్స్ మాట్లాడుతూ.. 'ఎంఎస్ ధోనీ గురించి అప్డేట్ ఇవ్వడం నా పరిధికి మించిన విషయం. అతను మాతో లేడు. కానీ గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. మహీ ఎప్పుడు ఆడడానికి సిద్ధంగా ఉంటాడో అతడికే తెలుసు' అని చెప్పాడు.

ఎరిక్ సైమన్స్ వ్యాఖ్యలతో ఈ సీజన్‌లో ఎంఎస్ ధోనీ ఎంట్రీపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచులలో 4 విజయాలు అందుకుని.. 8 పాయింట్లతో పట్టికలో ఆరవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ చూస్తే మిగిలిన ఐదు మ్యాచులలో గెలిస్తే కానీ.. టాప్ 4లో స్థానం దక్కదు. చెన్నై ఫామ్ చూస్తే.. అన్ని విజయాలు కష్టమే అని చెప్పాలి. సీఎస్కే ప్లేఆఫ్స్ చేరకుంటే.. మహీ ఆటను చూడలేము. ధోనీ చివరిసారిగా 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. ధోనీ గురించి మరో రూమర్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహీకి ఇదే చివరి సీజన్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే.. ఈ సీజన్ చివరి వరకు ఆగాల్సిందే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story