Manav Suthar Record: సూపర్ సుతార్.. రెండో టెస్టులోనే అశ్విన్, హర్భజన్‌ల రికార్డు బ్రేక్.. బెస్ట్ భారత బౌలర్‌గా..!
Manav Suthar Record: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత యువ స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Manav Suthar Record: సూపర్ సుతార్.. రెండో టెస్టులోనే అశ్విన్, హర్భజన్‌ల రికార్డు బ్రేక్.. బెస్ట్ భారత బౌలర్‌గా..!
Manav Suthar Record: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత యువ స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న సుతార్.. ఏకంగా 10 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన 24 ఏళ్ల సుతార్ తొలి మ్యాచ్‌లోనే 7 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలోనూ రాణిస్తున్నాడు. గాలెలో లంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి.. దిగ్గజాలు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్‌ల రికార్డులను బ్రేక్ చేశాడు.
మ్యాచ్‌లో మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4/76 గణాంకాలతో రాణించాడు. శ్రీలంక స్టార్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ వికెట్‌ను కూడా పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరింత విజృంభించాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీసిన అతడు.. ఆ తర్వాత కేవలం 10 బంతుల్లో శ్రీలంక లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6/55తో అదరగొట్టడంతో.. మ్యాచ్‌లో అతడి గణాంకాలు 10/131గా నమోదయ్యాయి. ఈ ప్రదర్శనతో సుతార్ శ్రీలంక గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2008లో గాలెలో హర్భజన్ 10/153, 2015లో అశ్విన్ 10/160 గణాంకాలు నమోదు చేశారు. ఇప్పుడు సుతార్ 10/131తో వారిద్దరినీ అధిగమించాడు.
అంతేకాదు శ్రీలంక గడ్డపై టెస్టులో 10 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా కూడా మానవ్ సుతార్ నిలిచాడు. అతడి కంటే ముందు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. రెండో టెస్టులోనే ఇలాంటి అరుదైన రికార్డు సాధించడం సుతార్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఇప్పటివరకు ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 17 వికెట్స్ పడగొట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన సుతార్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అతడి పేరు ట్రెండింగ్ అవుతోంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు, కేశర నువాంత మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. శ్రీలంక ఒక దశలో 90/5తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే నిరోషన్ డిక్వెల్లా, సోనల్ దినూష పోరాడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దినూష సెంచరీతో ఆకట్టుకోగా.. డిక్వెల్లా 80 పరుగులు చేశాడు. మానవ్ సుతార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ 66 పరుగులతో దూకుడుగా ఆడగా.. దేవదత్ పడిక్కల్ 44, కేఎల్ రాహుల్ 35 పరుగులు చేశారు. దీంతో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు, ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఒక దశలో 47/4తో కష్టాల్లో పడింది. అయితే ధనంజయ డి సిల్వా, సోనల్ దినూష కలిసి 91 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేకెత్తించారు. దినూష (84) ఔటైన తర్వాత మానవ్ సుతార్ మరోసారి చెలరేగడంతో శ్రీలంక లోయర్ ఆర్డర్ కుప్పకూలింది. చివరకు శ్రీలంక 206 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్ 165 పరుగుల ఘన విజయం సాధించింది. మానవ్ సుతార్ 10 వికెట్ల ప్రదర్శనతో మ్యాచ్ హీరోగా నిలిచాడు.




