Lungi Ngidi: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్‌!

Lungi Ngidi: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది.

Rishvik
Updated on: 25 April 2026 6:53 PM IST
Lungi Ngidi
X

Lungi Ngidi: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్‌!

Lungi Ngidi: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడి ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన 2.3వ ఓవర్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు ప్రయత్నించిన ఎంగిడి.. ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. ఈ సమయంలో అతడి తల నేలకు బలంగా తగలడంతో మైదానంలోనే విలవిల్లాడు.

లుంగి ఎంగిడి మైదానములో కుప్పకూలడంతో.. ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ వెంటనే అతడి వద్దకు చేరుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం మైదానంలోనే అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. అంబులెన్స్‌ను మైదానంలోకి తీసుకువచ్చారు. స్ట్రెచర్‌పై ఉంచి అతడిని అంబులెన్స్‌ ఎక్కించారు. అనంతరం అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మైదానంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంగిడి ఆరోగ్యం ఎలా ఉందనే ఆందోళన అటు ఆటగాళ్లలో, ఇటు అభిమానుల్లో నెలకొంది. అతడు త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

లుంగి ఎంగిడిని ఆస్పత్రికి తరలించిన తరువాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. అక్షర్ పటేల్ తన బౌలింగ్ కొనసాగించాడు. మ్యాచ్ ప్రారంభంలోనే పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రియాంశ్ ఆర్య 38పరుగులు, ప్రభుసిమ్రన్ సింగ్ 71 పరుగులతో విద్వంసం సృష్టిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా పంజాబ్ 116 పరుగులు చేసింది. ప్రభుసిమ్రన్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ ఎంచుకున్న డీసీ 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కేఎల్ రాహుల్ బరి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 152 పరుగులు సాధించాడు. నితీష్ రాణా 44 బంతుల్లో 91 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ జోడీ రెండో వికెట్‌కు 95 బంతుల్లో 220 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. రాహుల్ చేసిన 152 పరుగుల ఇన్నింగ్స్.. ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story