KL Rahul: ఐపీఎల్ 'లెజెండ్' కేఎల్ రాహుల్.. ఈ గణాంకాలు చూస్తే బిత్తరపోవాల్సిందే!

KL Rahul proves why he is an IPL legend. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణించిన భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు.

Rishvik
Published on: 2 May 2026 5:57 PM IST
KL Rahul
X

KL Rahul

KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత నిలకడగా రాణించిన భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. గణాంకాల పరంగా మాత్రమే కాదు.. మ్యాచ్‌లపై రాహుల్ చూపించిన ప్రభావం కూడా అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు (2026) రాహుల్ ప్రదర్శనను పరిశీలిస్తే.. అతడిని ఎందుకు 'ఐపీఎల్ లెజెండ్'గా పిలవబడుతున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. రాహుల్ ఐపీఎల్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

కేఎల్ రాహుల్ 2018 తర్వాత 17 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు అందుకున్నాడు. ఇది అతడి మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యానికి నిదర్శనం. ఒక ఆటగాడు మ్యాచ్ ఫలితాన్ని ఎంతవరకు ప్రభావితం చేయగలడో ఈ అవార్డు ద్వారా స్పష్టం అవుతోంది. అలాగే కేవలం 145 ఇన్నింగ్స్‌లలోనే 232 సిక్సర్లు కొట్టి భారత ఆటగాళ్లలో ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. వేగంగా 200 ఐపీఎల్ సిక్సర్లు పూర్తి చేసిన భారత ఆటగాడిగా కూడా రాహుల్ నిలిచాడు. ఒక్కో ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన సందర్భాల్లో కూడా అతను అగ్రస్థానంలో ఉన్నాడు. ఇట్టి అతడి అటాకింగ్ గేమ్‌కు ఓ నిదర్శనం.

రన్ మెషీన్‌గా కూడా లోకేష్ రాహుల్ తన ప్రతిభను నిరూపించాడు. ఐపీఎల్‌లో వేగంగా 3000, 4000, 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. అంతే కాకుండా రాహుల్ సగటు అత్యంత ఉన్నతంగా ఉండటం అతని స్థిరమైన ప్రదర్శనకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల చేసిన ఐదవ ఆటగాడిగా ఉన్నాడు. ప్రతి సీజన్‌లో తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. రాహుల్ ఆటలో క్లాస్, టైమింగ్, షాట్ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఇవే అతడిని ఉన్నత స్థాయిలో నిలబడుతుంది.

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున లోకేష్ రాహుల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా (ఆరెంజ్ క్యాప్ హోల్డర్) నిలిచాడు. ఢిల్లీ తరఫున తొమ్మిది మ్యాచ్‌లలో 54.12 సగటు, 185.83 స్ట్రైక్ రేట్‌తో 433 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయూయి. ఐపీఎల్ 2026లో రాహుల్ అత్యధిక స్కోరు 152 నాటౌట్. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఓ భారత బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోర్.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story