KL Rahul: కేఎల్ రాహుల్ ఊచకోత.. ఒక్క సెంచరీతో ఇన్ని రికార్డులా!

KL Rahul: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఊచకోత కోశాడు.

Rishvik
Published on: 25 April 2026 6:35 PM IST
KL Rahul
X

KL Rahul: కేఎల్ రాహుల్ ఊచకోత.. ఒక్క సెంచరీతో ఇన్ని రికార్డులా!

KL Rahul: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఊచకోత కోశాడు. 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 రన్స్ చేసి విధ్వంసం సృష్టించాడు. 47 బంతుల్లో సెంచరీ చేసిన రాహుల్.. 152 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ సెంచరీతో ఇన్ని రోజులు తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. అంతేకాదు ఈ శతకంతో ఎన్నో రికార్డులు బద్దలు బద్దలు కొట్టాడు. ఆ రికార్డుల లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు:

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (152) చేసిన భారత ప్లేయర్‌గా లోకేష్ రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరుపై ఉంది. 2025లో పంజాబ్ కింగ్స్‌పై అభిషేక్ 141 రన్స్ చేశాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు క్రిస్ గేల్ పేరుపై ఉంది. యూనివర్సల్ బాస్ 2013లో ఆర్‌సీబీ తరఫున ఆడుతూ పీడబ్ల్యూఐపై 175 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. 2008లో కేకేఆర్ తరఫున ఆడిన బ్రెండన్ మెకల్లమ్ ఆర్‌సీబీపై 158 రన్స్ బాదాడు. మూడో స్థానములో రాహుల్ ఉన్నాడు.

భారత్ తరఫున అత్యధిక స్కోర్:

పురుషుల టీ20 క్రికెట్‌లో 150కి పైగా స్కోరు నమోదు చేసిన రెండవ భారతీయ ఆటగాడిగా లోకేష్ రాహుల్ నిలిచాడు. 2024/25లో రాజ్‌కోట్‌లో మేఘాలయపై హైదరాబాద్ తరఫున తిలక్ వర్మ 151 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (152) చేసిన బ్యాటర్‌గా రాహుల్ ఉన్నాడు. తిలక్ రికార్డు బద్దలైంది. ఈ జాబితాలో అభిషేక్ శర్మ (148), శ్రేయాస్ అయ్యర్ (147), పునిత్ బిష్త్ (146) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఢిల్లీ నంబర్ 1గా రాహుల్:

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా లోకేష్ రాహుల్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఢిల్లీ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ పేరిట ఉంది. 2018లో ఇదే అరుణ్ జైట్లీ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 128 పరుగులు చేశాడు. తాజాగా రాహుల్ నంబర్ 1గా నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు:

లోకేష్ రాహుల్ కెరీర్‌లో ఇది ఆరవ ఐపీఎల్ సెంచరీ. సంజు శాంసన్ (5)తో సమానంగా నాలుగో స్థానంలో ఉన్న రాహుల్.. ఇప్పుడు నాలుగో స్థానానికి కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (8) ఉన్నాడు. జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే. 2022లో ముంబై ఇండియన్స్‌పై 56 బంతుల్లో సెంచరీ బాదాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story