Kavya Maran: ఏంటండీ వెంకీ గారూ..అతను అలా విసిరేస్తున్నాడు? కృనాల్ పాండ్యా బౌలింగ్‌పై కావ్య పాప షాక్
Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ మ్యాచ్‌లో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.
Kavya Maran: ఏంటండీ వెంకీ గారూ..అతను అలా విసిరేస్తున్నాడు? కృనాల్ పాండ్యా బౌలింగ్‌పై కావ్య పాప షాక్
Krunal Pandya: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోందంటే మైదానంలో ఆటగాళ్ల సిక్సర్లు, వికెట్ల రచ్చ ఒకెత్తయితే.. స్టాండ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మరో ఎత్తు. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ గెలిచినా, ఓడినా, స్టేడియంలో ఆమె హావభావాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో సెన్సేషనే. తాజాగా ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కావ్య మారన్ ఇచ్చిన ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్, దానికి పక్కనే ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ రియాక్షన్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తొలిసారి ఒక బౌలర్ వేసిన విచిత్రమైన బౌలింగ్ శైలిని చూసి కావ్య మారన్ నోరెళ్లబెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ స్టైల్ గురించి క్రికెట్ లవర్స్‌కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఓవర్‌లో ఎవరైనా బ్యాటర్ ఫోరో, సిక్సరో కొట్టారంటే.. ఆ తర్వాత బంతికి స్పిన్‌ను పక్కనబెట్టి వేగంగా బౌన్సర్లు వేయడం కృనాల్‌కు అలవాటు. అందుకే ఆయన్ను నెటిజన్లు ఫన్నీగా లెఫ్ట్ ఆర్మ్ ఇసిరేసుడు బౌలర్ అని పిలుస్తుంటారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లోనూ సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయింది.
ఆ ఓవర్‌లో రెండో బంతికే డేంజరస్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేసిన ఆనందంలో ఉన్న కృనాల్‌కు.. క్రీజులోకి వచ్చిన యంగ్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి గట్టి షాకిచ్చాడు. నితీష్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లాస్ సిక్సర్ బాదాడు. దాంతో కోపంతో కృనాల్ వేసిన తర్వాతి బౌన్సర్ వైడ్‌గా వెళ్లింది. మళ్లీ మూడో బంతిని కూడా నితీష్ సిక్సర్‌గా మలిచాడు. వరుసగా సిక్సర్లు పడటంతో ఈగో దెబ్బతిన్న కృనాల్ పాండ్యా.. ఆఖరి బంతిని స్పిన్ అన్న సంగతి మరిచిపోయి, బంతిని చేత్తో పట్టుకుని విసిరేసినంత వేగంగా విసిరాడు. ఆ బంతిని నితీష్ ఆడే ప్రయత్నం చేయగా, ఎక్కువ బౌన్స్ అవ్వడంతో గాల్లోకి లేచి రెండు పరుగులు వచ్చాయి.
వైరల్ అయిన కావ్య ఎక్స్‌ప్రెషన్
కృనాల్ పాండ్యా అంతలా విసిరేస్తూ బౌలింగ్ చేయడాన్ని లైవ్‌లో తొలిసారి చూసిన కావ్య మారన్ ఒక్కసారిగా షాక్ అయింది. విఐపీ బాక్స్‌లో తన పక్కనే కూర్చున్న క్రికెట్ లవర్, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ వైపు తిరిగి.. అదేంటండి వెంకీ గారు.. అతను అలా విసిరేస్తున్నాడు? అన్నట్టు ఆశ్చర్యంగా సైగలు చేసింది. ఆ తర్వాత ఏంటో ఈ బౌలింగ్ అన్నట్టు ఆమె ఇచ్చిన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ మెటీరియల్‌గా మారాయి.
Kavya Maran reaction to Krunal Pandya bowling action was priceless 😭😂
— Rohan💫 (@rohann__45) May 22, 2026
She didn’t look happy with it.
That “yeh kya daal raha hai bhai?” expression was too funny 🤣 pic.twitter.com/WYPeU4Nbsj




