Karthik Sharma: ధోనీ గన్ స్టైల్ రిపీట్.. మిస్టర్ కూల్ లేని లోటును తీర్చిన కార్తిక్ శర్మ
Karthik Sharma: చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న యువ ఆటగాడు కార్తిక్ శర్మ, ముంబై ఇండియన్స్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు.
Karthik Sharma: ధోనీ గన్ స్టైల్ రిపీట్.. మిస్టర్ కూల్ లేని లోటును తీర్చిన కార్తిక్ శర్మ
karthik sharma: ఐపీఎల్ సగం పూర్తైన ధోని ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఆయన అభిమానులు ధోనిని ఎంతో మిస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన మేనరిజాన్ని మిస్ అవుతున్నారు. అయితే కార్తిక్ శర్మ ఆ లోటును తీర్చాడు.
ధోనీ స్టైల్‌లో కార్తిక్ శర్మ సెలబ్రేషన్
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న యువ ఆటగాడు కార్తిక్ శర్మ, ముంబై ఇండియన్స్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు. అర్ధశతకం పూర్తి చేసిన వెంటనే ఆయన చేసిన “గన్ సెలబ్రేషన్” అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే తరహా సెలబ్రేషన్‌ను గతంలో ఎంఎస్ ధోనీ శ్రీలంకపై 183 పరుగులు చేసినప్పుడు చేశాడు. అదే స్టైల్‌ను కార్తిక్ మైదానంలో మళ్లీ చూపించాడు.
మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్
160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో చెన్నై జట్టు ప్రారంభంలో కొంత ఇబ్బంది పడింది. సంజూ శాంసన్ త్వరగా అవుట్ అయ్యాడు. ఉర్విల్ పటేల్ వేగంగా 24 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత కార్తిక్ శర్మ క్రీజ్‌లోకి వచ్చాడు. అతను 40 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి.
గాయక్వాడ్‌తో అద్భుత భాగస్వామ్యం
కార్తిక్ శర్మ, కెప్టెన్ ఋతురాజ్ గాయక్వాడ్‌తో కలిసి 98 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించారు. గాయక్వాడ్ 48 బంతుల్లో 67 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మ్యాచ్ తర్వాత కార్తిక్ శర్మ వ్యాఖ్యలు
మ్యాచ్ అనంతరం కార్తిక్ శర్మ మాట్లాడుతూ, “ఇది నా తొలి ఐపీఎల్ అర్ధశతకం. ఈరోజు రన్స్ చేస్తే ఇలా సెలబ్రేట్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాను” అని తెలిపాడు. అలాగే “మ్యాచ్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడమే నా లక్ష్యం. గాయక్వాడ్ అన్న కూడా సహజంగా ఆడమని సూచించారు” అని చెప్పాడు.




