RR vs CSK: సీఎస్‌కేను ఆదుకున్న ఓవర్టన్.. లేదంటే 100 పరుగుల లోపే!

RR vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్ఆర్, సీఎస్‌కే మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే తక్కువ స్కోర్ చేసింది.

Rishvik
Published on: 30 March 2026 9:37 PM IST
RR vs CSK
X

RR vs CSK: సీఎస్‌కేను ఆదుకున్న ఓవర్టన్.. లేదంటే 100 పరుగుల లోపే!

RR vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. తక్కువ స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లు చెలరేగడంతో చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై తరఫున జేమీ ఓవర్టన్ టాప్ స్కోరర్. 36 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సుతో 43 రన్స్ చేశాడు.

ఇనింగ్స్ చివరలో ఓవర్టన్ క్రీజులో నిలబడకుంటే.. చెన్నై 100 పరుగులు కూడా చేయకపోయేది. చెన్నై బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ (17), కార్తీక్ శర్మ (18)లు మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్స్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి రాజస్థాన్‌ రాయల్స్ బౌలింగ్‌ ఎంచుకుంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేకు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు సంజు శాంసన్ (6), రుతురాజ్ గైక్వాడ్ (6) విఫలమయ్యారు. ఆయుష్ మాత్రే (0), మాథ్యూ షార్ట్ (2) కూడా విఫలమయ్యారు. జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్ చెలరేగడంతో చెన్నై టాపార్డర్ కుప్పకూలింది.

సర్ఫరాజ్ ఖాన్, కార్తీక్ శర్మలు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న శివమ్ దూబే (6) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో జేమీ ఓవర్టన్ ఒంటరి పోరాటం చేశాడు. ఓవర్టన్ క్రీజులో నిలవకుంటే చెన్నై 100 పరుగులు కూడా చేయకపోయేది. రాజస్థాన్ బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో చెన్నైని తక్కువ స్కోరుకే పరిమితం అయింది. రాజస్థాన్ ముందు 128 పరుగుల లక్ష్యం ఉంది. రాజస్థాన్ జట్టులో హిట్టర్లు ఉండడంతో సునాయాస విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story