Varun Chakaravarthy: ఐపీఎల్‌లో స్పిన్నర్ల రాజ్యం.. టాప్‌లో ఎవరున్నారో తెలుసా?

Rashid Khan leads the list of MOM. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్ల పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే.

Rishvik
Published on: 4 May 2026 2:36 PM IST
Varun Chakaravarthy
X

Varun Chakaravarthy

Varun Chakaravarthy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్ల పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రిస్ట్ స్పిన్నర్లు (లెగ్ స్పిన్నర్లు, చైనామన్ బౌలర్లు) మ్యాచ్‌ను ఒక్కసారిగా తారుమారు చేసే సామర్థ్యంను కలిగి ఉంటారు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న స్పెషలిస్ట్ రిస్ట్ స్పిన్నర్ల జాబితా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ మొత్తం 13 ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకుని తన ప్రభావాన్ని చాటుకున్నాడు. చాలా ఏళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఆడిన అతడు... ఇప్పుడు గుజరాత్ తరఫున ఆడుతున్నాడు.

ఈ జాబితాలో రషీద్ ఖాన్ తర్వాత భారత వెటరన్ అమిత్ మిశ్రా 12 అవార్డులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో వరుణ్ చక్రవర్తి 8 అవార్డులతో నిలిచాడు. తన మిస్టరీ స్పిన్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పుతూ ఈ జాబితాలో స్థానం సంపాదించాడు. నాలుగో స్థానంలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ తలో 7 అవార్డులతో ఉన్నారు. ఈ లిస్టులో ఐదో స్థానంలో లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ 4 అవార్డులతో నిలిచాడు. ఐపీఎల్ ప్రారంభంలోనే తన స్పిన్ మాయతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వార్న్ ఈ జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.

మొత్తం మీద చూస్తే.. రిస్ట్ స్పిన్నర్లు ఐపీఎల్‌లో ఎంత ప్రభావవంతంగా ఉంటారో ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్ ఫలితాన్ని మార్చే సామర్థ్యం ఈ బౌలర్ల ప్రత్యేకత. భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని పేర్లు చేరే అవకాశముంది. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్‌ రైడర్స్ విజయం అందుకుంది. కోల్‌కతా విజయంలో అంగ్‌క్రిష్‌ రఘువంశీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజింక్య రహానె (43; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక పాత్ర పోషించారు.

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు:

13 రషీద్ ఖాన్

12 అమిత్ మిశ్రా

8 వరుణ్ చక్రవర్తి

7 యుజ్వేంద్ర చాహల్/ కుల్దీప్ యాదవ్

4 షేన్ వార్న్

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story