IPL 2026 Playoff Chances: ఐదు జట్ల మద్యే ప్లేఆఫ్స్ రేస్ పోటీ.. ఆ మూడు టీమ్స్ అవుట్!

IPL 2026 Playoff Chances: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకోగా.. ప్లేఆఫ్స్ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది.

Rishvik
Published on: 2 May 2026 6:39 PM IST
IPL 2026 Playoff Chances
X

IPL 2026 Playoff Chances: ఐదు జట్ల మద్యే ప్లేఆఫ్స్ రేస్ పోటీ.. ఆ మూడు టీమ్స్ అవుట్!

IPL 2026 Playoff Chances: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకోగా.. ప్లేఆఫ్స్ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. కొన్ని జట్లు సేఫ్ జోన్‌లోకి చేరువలో ఉండగా.. మరికొన్ని జట్లు ‘డూ ఆర్ డై’ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇక నుంచి ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకు కీలకంగా మారింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఐదు జట్ల మద్యే ప్లేఆఫ్స్ రేస్ పోటీ ఉందని చెప్పొచ్చు. మరో రెండు జట్లకు అవకాశాలు ఉండగా.. ఓ మూడు టీమ్స్ మాత్రం ఇప్పటికే రేసు నుంచి అనధికారికంగా తప్పుకున్నాయి. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రోడ్‌మ్యాప్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

పంజాబ్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెండుగా ఉన్నాయి. పంజాబ్ మిగిలిన 6 మ్యాచ్‌లలో కేవలం 2 గెలిస్తే సరిపోతుంది. అలాగే సన్‌రైజర్స్ 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే ముందుకు దూసుకెళ్లే అవకాశముంది. రాజస్థాన్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. 4 మ్యాచ్‌లలో 2 గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెరుగవుతాయి. బెంగళూరు కూడా 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధిస్తే సేఫ్ జోన్‌లోకి వెళ్లగలదు. ప్రస్తుతం పట్టికలో ఈ నాలుగు జట్లే టాప్-4లో ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల పరిస్థితి కొంత కఠినంగా ఉంది. 9 మ్యాచ్‌ల్లో 10 పాయింట్స్ ఖాతాలో వేసుకున్న గుజరాత్ మిగిలిన 5 మ్యాచ్‌లలో 3 గెలవాల్సి ఉంది. చెన్నై అయితే 6 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించాల్సిన పరిస్థితి. ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలి. అలాగే ఢిల్లీ కూడా 5 మ్యాచ్‌లలో 4 గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు జట్లకు ప్రతి మ్యాచ్ ఫైనల్‌ లాంటిదే. ఈ మూడింటిలో గుజరాత్ కాస్త బెటర్ పొజిషన్లో ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్నట్లే. ఈ జట్లు మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలవడంతో పాటు నెట్ రన్‌రేట్ మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా జరిగినా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ మూడు టీమ్స్ మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గెలవాలి. ఒక్కటి ఓడినా అంతే సంగతులు. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఈ జట్లకు అన్ని విజయాలు కష్టమే. మొత్తం మీద ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేస్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగనుంది. ఇక నుంచి ప్రతి మ్యాచ్ అభిమానులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించనుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story