IPL 2026 Full Schedule: ఐపీఎల్ 2026 రెండో షెడ్యూల్ వచ్చేసింది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
IPL 2026 Full Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండో దశ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది.
IPL 2026 Full Schedule: ఐపీఎల్ 2026 రెండో షెడ్యూల్ వచ్చేసింది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
IPL 2026 Full Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండో దశ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. టోర్నీలో మిగిలిన లీగ్ మ్యాచ్‌లు ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు జరగనున్నట్లు వెల్లడించింది. రెండో దశలో మొత్తం 50 మ్యాచ్‌లు దేశవ్యాప్తంగా 12 వేదికల్లో జరుగనున్నాయి. ఈ రెండో దశ మ్యాచ్‌లు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్ నగరాల్లో జరగనున్నాయి.
IPL 2026 Full Schedule
ఇప్పటికే మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు మొదటి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో దశ ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోరు కూడా ఉంది. ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఏప్రిల్ 23న ముంబైలో.. రెండో మ్యాచ్ మే 2న చెన్నైలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లు టోర్నీకి మరింత ఉత్కంఠను తీసుకురానున్నాయి.
రెండో దశలో మొత్తం ఎనిమిది డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. పంజాబ్ కింగ్స్ తమ హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్, ధర్మశాలలో ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఆర్సీబీ బెంగళూరులో మూడు మ్యాచ్‌లు, రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ప్లేఆఫ్స్ వేదికలను త్వరలో ప్రకటించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మొత్తంగా ఐపీఎల్ 2026 రెండో దశ మ్యాచ్‌లు టోర్నీని మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నాయి. మొత్తానికి పీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చేసింది. తొలి దశలో 20 మ్యాచులకు మాత్రమే వేదికలు, తేదీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రెండో దశతో మొత్తం 70 లీగ్ మ్యాచులకూ షెడ్యూల్ ప్రకటించినట్లైంది. ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి ఆరంభం కానుంది. అభిమానులకు ఐపీఎల్ మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
IPL 2026 Full Schedule




