IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు బిగ్ ట్విస్ట్.. ఆ ముగ్గురు స్టార్స్ దూరం?

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ ఫైనల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

Rishvik
Published on: 1 May 2026 6:46 PM IST
IPL 2026 Final
X

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు బిగ్ ట్విస్ట్.. ఆ ముగ్గురు స్టార్స్ దూరం?

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ ఫైనల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మే 31 నుంచి లాహోర్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా-పాకిస్థాన్ వన్డే సిరీస్‌కు ఈ ముగ్గురు ఎంపిక కావడంతో.. ఐపీఎల్ ఫైనల్‌కు దూరం కావాల్సి ఉంటుంది. మే 31, జూన్ 2, 4 తేదీలలో జరిగే మ్యాచ్‌లు 2027 వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే ఈ షెడ్యూల్‌పై పీసీబీ నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ తమ ఐపీఎల్ జట్లకు కీలకమైన మ్యాచ్ విన్నర్ల. హెడ్ తన దూకుడు బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) మ్యాచ్‌లను మలుపుతిప్పుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు మంచి ఆరంభాలు ఇస్తూ భారీ స్కోరుకు దోహదపడుతున్నాడు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీతో పాటు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎస్‌ఆర్‌హెచ్‌కు అతి పెద్ద బలంగా మారాడు.

గాయం కారణంగా మొన్ననే ఐపీఎల్ 2026లో ఎంట్రీ ఇచ్చిన కమిన్స్.. జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న జోష్ హేజిల్‌వుడ్ తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ఇలాంటి కీలక ఆటగాళ్లు ఫైనల్‌కు అందుబాటులో లేకపోతే జట్ల సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది.

ఇప్పుడు ఈ అంశంపై తుది నిర్ణయం బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా చేతుల్లో ఉంది. ఆటగాళ్లు దేశం తరఫున ఆడాలా? లేక ఫ్రాంచైజీ కోసం ఐపీఎల్ ఫైనల్‌లో పాల్గొనాలా? అన్నది కీలక ప్రశ్నగా మారింది. సాధారణంగా ప్లేయర్స్ జాతీయ జట్టుకే ఆడడానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తారు. అయితే ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్ ఫైనల్ కూడా చాలా ముఖ్యమైనదే.

మరోవైపు ఆస్ట్రేలియా కొత్త ప్రతిభను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికప్పుడు స్టార్ ఆటగాళ్లపై ఆధారపడకుండా.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏదేమైనా ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఈ పరిణామం పెద్ద చర్చకు దారితీసింది. చివరికి ఆటగాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో, బోర్డులు ఎలా స్పందిస్తాయో అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story