IPL 2026 : స్టేడియంలో అభిమానుల మధ్య గొడవ..పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు భయ్యా
IPL 2026 :ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో తొలి విజయాన్ని నమోదు చేసింది.
IPL 2026 : స్టేడియంలో అభిమానుల మధ్య గొడవ..పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు భయ్యా
DC vs LSG Fan Fight : ఐపీఎల్ అంటేనే కేవలం ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు.. అంతకు మించిన ఎమోషన్. ఒక్కోసారి ఆ ఎమోషన్ హద్దులు దాటితే మైదానం బయట కూడా పోరాటాలు జరుగుతాయని బుధవారం నాటి మ్యాచ్ నిరూపించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకున్నప్పటికీ, గ్యాలరీలో అభిమానుల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగింది? ఫ్యాన్స్ మధ్య ఘర్షణ
మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానుల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం మొదలైంది. అది కాస్తా ముదిరి ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే వరకు వెళ్లింది. పక్కనే ఉన్న ఇతర అభిమానులు వారించడానికి ప్రయత్నించినప్పటికీ, ఇరువర్గాలు తగ్గలేదు. చివరకు స్టేడియం భద్రతా సిబ్బందితో పాటు పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొదటి గెలుపు నమోదు
ఒకవైపు గ్యాలరీలో రచ్చ జరుగుతుంటే, మరోవైపు మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లు కూడా పూర్తి కాకుండానే లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ, ఛేజింగ్ ప్రారంభంలో ఢిల్లీ కాస్త తడబడింది. కానీ, ఆ తర్వాత బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి, చివరి వరకు పోరాడి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ విజయం ఎంతో ఊరటనిచ్చింది. ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీకి ఇదే మొదటి విజయం కావడం విశేషం. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచిన ఢిల్లీ, ఈ గెలుపుతో ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది.




