IPL: ఐపీఎల్‌లో తీవ్ర వివాదం.. వైభవ్ సూర్యవంశీపై ‘చైల్డ్ లేబర్’ ఆరోపణలు
IPL: ఐపీఎల్లో సంచలనంలా దూసుకొచ్చాడు యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఓవైపు రికార్డులతో పాటు మరోవైపు వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు వైభవ్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి.
IPL
IPL: ఐపీఎల్లో సంచలనంలా దూసుకొచ్చాడు యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఓవైపు రికార్డులతో పాటు మరోవైపు వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు వైభవ్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి.
అసలేంటీ వివాదం.?
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడుతున్న 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై కొత్త వివాదం చెలరేగింది. అతని వయసు తక్కువగా ఉండటంతో, అతన్ని ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో ఆడించడం సరైందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సామాజిక కార్యకర్త అతని పాల్గొనడం “చైల్డ్ లేబర్” కిందకి వస్తుందని ఆరోపించారు.
కార్యకర్త ఆరోపణలు ఏమిటి?
సీఎమ్ శివకుమార్ నాయక్ అనే కార్యకర్త ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. 15 ఏళ్ల బాలుడిని ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఆడించడం అనేది అతని హక్కులకు విరుద్ధమని అన్నారు. ఈ వయసులో చదువుపై దృష్టి పెట్టాల్సిందిగా, ఇలాంటి ఒత్తిడి ఉన్న టోర్నీల్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. అలాగే ఈ విషయంపై పోలీస్ కేసు కూడా నమోదు చేస్తానని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో భారీ చర్చ
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలామంది ఈ ఆరోపణలను ఖండించారు. గతంలో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా చిన్నారులు సినిమాల్లో నటించడం, రియాలిటీ షోలలో పాల్గొనడం కూడా జరుగుతుంటే, వాటిపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు రావట్లేదని ప్రశ్నించారు. కొందరు అయితే ఇది అతిశయోక్తి అని విమర్శించారు.
వైభవ్ సాధించిన రికార్డులు
బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశి చాలా చిన్న వయసులోనే రికార్డులు సృష్టించాడు. IPL 2025 వేలంలో కేవలం 13 ఏళ్ల వయసులోనే రూ. 1.10 కోట్లకు ఎంపికై చరిత్ర సృష్టించాడు. 2025 ఏప్రిల్ 19న లక్నోజట్టుతో తన అరంగేట్రం చేశాడు. అప్పటికి అతని వయసు 14 ఏళ్లు మాత్రమే. ఇప్పుడు 2026 సీజన్‌లో కూడా అతన్ని జట్టు కొనసాగించింది. ప్రతి మ్యాచ్‌కు రూ. 7.5 లక్షలు పొందుతున్నాడు.




