IND W vs PAK W: టాస్ సమయంలో టచ్ చేయని కెప్టెన్స్.. మరోసారి తెరపైకి నో హ్యాండ్‌షేక్..
IND W vs PAK W: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘నో హ్యాండ్‌షేక్’ పద్ధతి మరోసారి కనిపించింది.
IND W vs PAK W: టాస్ సమయంలో టచ్ చేయని కెప్టెన్స్.. మరోసారి తెరపైకి నో హ్యాండ్‌షేక్..
India vs Pakistan Women's Asia Cup: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘నో హ్యాండ్‌షేక్’ పద్ధతి మరోసారి కనిపించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా పరస్పరం కరచాలనం చేసుకోకుండానే మ్యాచ్ ప్రక్రియను ముగించారు. టాస్ గెలిచిన ఫాతిమా సనా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, ఇరు జట్ల సారథులు వ్యాఖ్యాతలతో మాట్లాడిన అనంతరం ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లిపోయారు. భారత్-పాక్ జట్ల మధ్య గత కొద్దికాలంగా కొనసాగుతున్న ఈ వైఖరి ఆసియా కప్ పోరులోనూ కొనసాగింది.
కొనసాగుతున్న పాత సంప్రదాయం..
భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్‌ల సమయంలో షేక్‌హ్యాండ్స్ ఇవ్వకపోవడం గత ఏడాది కాలంగా క్రమం తప్పకుండా కనిపిస్తోంది. ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో 2025 నుంచి భారత క్రికెట్ జట్లు ఐసీసీ లేదా ఏసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం నిలిపివేశాయి. పురుషుల, అండర్-19 టోర్నీలతో పాటు మహిళల ప్రపంచకప్‌లోనూ ఇరు జట్లు ఇదే విధానాన్ని పాటించాయి. ఇటీవల జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్‌లోనూ హర్మన్‌ప్రీత్ బృందం పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు.
టాస్ తర్వాత అదే సీన్..
ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో కరచాలనంపై స్పష్టమైన సమాధానం రానప్పటికీ, మైదానంలో మాత్రం ఇరు జట్ల కెప్టెన్లు పాత విధానానికే కట్టుబడ్డారు. టాస్ కాయిన్ పడిన తర్వాత అధికారిక సంభాషణలు పూర్తయినా సాధారణంగా జరిగే హ్యాండ్‌షేక్ జరగలేదు. గ్రూప్-A మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు ఆరంభంలోనే ఒత్తిడిలోకి నెట్టారు.




