IND vs ENG: వైభవ్ అరంగేట్రం.. తుది జట్టులో సంజు కూడా.. వేటు మనోడి పైనే!
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు.
IND vs ENG: వైభవ్ అరంగేట్రం.. తుది జట్టులో సంజు కూడా.. వేటు మనోడి పైనే!
India Playing XI vs England 2nd T20: భారత్-ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్‌లో మరికొద్ది గంటల్లో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నివేదికల ప్రకారం.. యువ సంచలనం c. ఐర్లాండ్ టీ20 సహా ఇంగ్లండ్ తొలి టీ20లో అవకాశం దక్కని 15 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌కు రెండో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు పక్కా అని సమాచారం.
స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీంతో తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన సంజు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మిడిల్ ఆర్డర్లో మరో కీలక మార్పు జరిగే అవకాశం ఉంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మను తుది జట్టు నుంచి తప్పించి.. ఇషాన్ కిషన్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపనున్నారు.
ఈ మార్పులతో బ్యాటింగ్ ఆర్డర్లో మరింత సమతుల్యత తీసుకురావాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2026లో సంజు, ఇషాన్, అభిషేక్ రాణించడంతో.. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట. ఇటీవల తిలక్ వరుసగా విఫలమవుతున్న విషయం తెలిసిందే.
బౌలింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. స్పిన్ త్రయం రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌పై జట్టు యాజమాన్యం మరోసారి నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ రెండో టీ20లోనూ కొనసాగనున్నారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు జట్టులో ఉండనున్నారు.
శివమ్ దూబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆడుతాడు. మొదటి మ్యాచ్‌లో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగియడంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా ఉంది. దీంతో రెండో టీ20లో విజయం సాధించి ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా): వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.




