IND-W vs PAK-W: శివాలెత్తిన శ్రీచరణి.. 55 పరుగులకే కుప్పకూలిన పాక్.. హిస్టరీలోనే చెత్త రికార్డ్..!

IND-W vs PAK-W: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న 9వ టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు.

Venkat
Published on: 5 Sept 2026 9:39 PM IST
IND-W vs PAK-W
X

IND-W vs PAK-W: శివాలెత్తిన శ్రీచరణి.. 55 పరుగులకే కుప్పకూలిన పాక్.. హిస్టరీలోనే చెత్త రికార్డ్..!

India Women vs Pakistan Women: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న 9వ టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. భారత బౌలింగ్ దాడికి తలొగ్గిన పాకిస్థాన్ మహిళల జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ (WT20I) చరిత్రలోనే పాకిస్థాన్‌కు ఇది అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. భారత యువ స్పిన్నర్ ఎన్. శ్రీ చరణి 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించింది. దీంతో భారత్ గెలుపునకు 120 బంతుల్లో 56 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించబడింది.

పట్టు తప్పిన పాకిస్థాన్ బ్యాటింగ్..

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు మునీబా అలీ, షావాల్ జుల్ఫీకర్ తొలి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన షఫాలీ వర్మ బ్రేక్‌త్రూ అందించడంతో పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. శ్రీ చరణి స్టంప్స్ టూ స్టంప్స్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. పాకిస్థాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో ఆ జట్టు 55 పరుగులకే పరిమితమైంది.

రికార్డుల్లో శ్రీ చరణి బౌలింగ్..

ఈ మ్యాచ్‌లో శ్రీ చరణి (3/7) నమోదు చేసిన గణాంకాలు మహిళల ఆసియా కప్ చరిత్రలోనే భారత్ తరఫున అత్యుత్తమ ఎకానమీ బౌలింగ్ గణాంకాల్లో (4 ఓవర్ల కోటాలో) దీప్తి శర్మ (2022లో థాయ్‌లాండ్‌పై 3/7) సరసన నిలిచాయి. అలాగే భారత మహిళల టీ20 చరిత్రలోనూ ఇది సంయుక్తంగా అత్యుత్తమ పొదుపైన స్పెల్స్‌లో ఒకటిగా నమోదైంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story