వైభవ్ సూర్యవంశీ ఈ 7 రికార్డులు బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు.. లిస్ట్ చూస్తే షాకే..?
Vaibhav Suryavanshi Records: వయసు 15 ఏళ్లే.. కానీ రికార్డుల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకుపోతున్నాడు.
వైభవ్ సూర్యవంశీ ఈ 7 రికార్డులు బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు.. లిస్ట్ చూస్తే షాకే..?
Vaibhav Suryavanshi Records: వయసు 15 ఏళ్లే.. కానీ రికార్డుల విషయంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ నుంచి దేశవాళీ క్రికెట్ వరకు తక్కువ వయసులోనే ఎన్నో అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీలో 15 ఏళ్ల 157 రోజుల వయసులో అర్ధశతకం బాది మరో రికార్డు సృష్టించాడు.
1. ఐపీఎల్‌లో అతి పిన్న వయసులోనే ఫిఫ్టీ..
కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో ఐపీఎల్‌లో అర్ధశతకం సాధించి వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
2. ఐపీఎల్‌లో అత్యంత చిన్న వయసులో సెంచరీ..
ఫిఫ్టీతో ఆగలేదు. అదే వయసులో ఐపీఎల్ సెంచరీ కూడా బాదేశాడు. 14 ఏళ్ల 32 రోజులకే శతకం సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. పురుషుల టీ20 క్రికెట్‌లోనూ అత్యంత చిన్న వయసులో శతకం చేసిన ఆటగాళ్లలో అగ్రస్థానానికి చేరాడు.
3. భారత బ్యాటర్‌గా అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ..
వైభవ్ మరో సంచలన రికార్డును 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసి అందుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
4. లిస్ట్-ఏలో అతి పిన్న వయసులో సెంచరీ..
లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ వైభవ్ పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 14 ఏళ్ల 272 రోజుల వయసులో సెంచరీ సాధించి ఈ ఫార్మాట్‌లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడయ్యాడు.
5. టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు..
పవర్ హిటింగ్‌లోనూ వైభవ్ ప్రత్యేకమే. కేవలం 514 బంతుల్లో 100 సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ ఘనతతో కీరన్ పొలార్డ్ రికార్డును అధిగమించాడు. వైభవ్ 29 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు.
6. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు..
ఐపీఎల్ 2026లో వైభవ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సీజన్‌లో 72 సిక్సర్లు కొట్టి ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది.
7. దులీప్ ట్రోఫీలో అతి పిన్న వయసులో ఫిఫ్టీ..
తాజాగా దులీప్ ట్రోఫీలో 15 ఏళ్ల 157 రోజుల వయసులో అర్ధశతకం సాధించాడు. కేవలం 42 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసి, 57 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.
రికార్డుల రారాజుగా వైభవ్..!
ఇంత చిన్న వయసులోనే ఐపీఎల్, టీ20, లిస్ట్-ఏ, దులీప్ ట్రోఫీ వంటి వేర్వేరు వేదికల్లో వైభవ్ సాధించిన రికార్డులు అతడి ప్రతిభకు నిదర్శనం. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ అతడి ఆట మరింత మెరుగైతే.. ప్రస్తుతం నెలకొల్పిన రికార్డులు భవిష్యత్తులో మరింత పెద్ద ఘనతలకు బాటలు వేసే అవకాశం ఉంది.




