Female Players: మహిళా ఆటగాళ్ల ప్రైవేట్ ఫొటోలు లీక్.. అవి నా భర్తతో నేను పంచుకున్న ఫొటోలంటూ..!
Female Players: డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్ల ప్రైవసీని దెబ్బతీస్తూ సైబర్ నేరగాళ్లు చేసిన ఫోటో లీకుల వ్యవహారం సంచలనం రేపుతోంది.
Female Players: మహిళా ఆటగాళ్ల ప్రైవేట్ ఫొటోలు లీక్.. అవి నా భర్తతో నేను పంచుకున్న ఫొటోలంటూ..!
Female Wrestlers : డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లోకి దిగారంటే చాలు.. పురుష రెజ్లర్లతో సమానంగా ఫైట్ చేస్తూ, తమ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు మహిళా రెజ్లర్లు. స్క్రీన్ మీద సెలబ్రిటీలుగా వెలిగిపోయే ఈ స్టార్లకు.. ఆ పాపులారిటీనే ఒక శాపంగా మారుతోంది. సైబర్ నేరగాళ్లు వీరి క్లౌడ్ అకౌంట్లను, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి, ఎలాంటి అనుమతి లేకుండా అత్యంత వ్యక్తిగత ఫోటోలను ఆన్లైన్లో లీక్ చేసిన ఘటనలు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. రింగ్‌లో ఎంతటి వీరులనైనా మట్టికరిపించే ఈ మహిళా తారలు.. తెరవెనుక హ్యాకర్ల చేతిలో ఎలా మానసిక నరకాన్ని అనుభవించారో, దాన్ని ఎలా ఎదిరించారో ఇప్పుడు చూద్దాం.
డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలోనే అతి పిన్న వయసులో దివాస్ ఛాంపియన్‌గా నిలిచిన జేడ్ బెవిస్.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అత్యంత దారుణమైన సైబర్ దాడికి గురైంది. ఆమె వ్యక్తిగత ఫోటోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే తోటి రెజ్లర్ల అండదండలతో, అభిమానుల సపోర్ట్‌తో ఆమె ఆ కఠినమైన దశను దాటి తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించగలిగింది. ఇక 14 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసిన షార్లెట్ ఫ్లెయిర్ సైతం ఈ డిజిటల్ దొంగల బారిన పడ్డారు. తన అనుమతి లేకుండా ఫోటోలను దొంగిలించారని, వాటిని వెంటనే వెబ్సైట్ల నుండి తొలగించాలంటూ ఆమె సైబర్ వేధింపులపై తీవ్రంగా గళమెత్తింది.
ఈ సైబర్ దాడుల తాలూకు మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి టోని స్టార్మ్ ఉదంతమే ఒక ఉదాహరణ. తన ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన బాధతో ఆమె ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్లనే డిలీట్ చేసుకుని దూరం వెళ్ళిపోయింది. దాంతో అభిమానులు, తోటి స్టార్లు నిందితులను శిక్షించాలంటూ #WeSupportToniStorm హ్యాష్‌ట్యాగ్‌తో గ్లోబల్ ట్రెండ్ సృష్టించి ఆమెకు అండగా నిలిచారు. మరోవైపు మాజీ ఛాంపియన్ కైట్లిన్కు ఎదురైన అనుభవం మరింత దారుణం. ఆమె ఫోటోలు లీక్ అయిన క్రమంలో.. ఒక ఆకతాయి అభిమాని లైవ్ షో జరుగుతుండగా ఆ ఫోటో పోస్టర్‌ను పట్టుకుని రావడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.
ఈ అవమానం, మానసిక ఒత్తిడి వల్లే తాను తిరిగి రెస్లింగ్ రింగ్‌లోకి రాకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె కన్నీటి పర్యంతమైంది. అయితే ఇదే వ్యవహారంపై మరియా కనెల్లిస్ స్పందించిన తీరు అందరికీ రోల్ మోడల్‌గా నిలిచింది. లీకైన ఫోటోలపై ఆమె ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ.. అవి నా భర్తతో నేను పంచుకున్న వ్యక్తిగత ఫోటోలు.. ఒక వైవాహిక బంధంలో అవి చాలా సాధారణం. కానీ ఇతరుల ప్రైవసీని దొంగిలించే హ్యాకర్లకు మాత్రం కచ్చితంగా మానసిక చికిత్స అవసరం అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ఒక మహిళ అనుమతి లేకుండా ఆమె వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడం చట్టరీత్యా నేరం, నైతికంగా ఘోరం. ఈ లీకుల వెనుక ఉన్న సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




