LSG vs GT: గిల్, బట్లర్ హాఫ్ సెంచరీలు.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ!
LSG vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
LSG vs GT: గిల్, బట్లర్ హాఫ్ సెంచరీలు.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ!
LSG vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఎల్‌ఎస్‌జీ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని జీటీ మరో 8 బంతులు ఉండగానే 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
గుజరాత్ విజయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56), ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (60) కీలక పాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, షమీ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంలో గుజరాత్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోగా.. లక్నో రెండో ఓటమిని చవిచూసింది.
165 పరుగుల ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నెమ్మదిగా ఆడారు. 4 ఓవర్లకు గుజరాత్ స్కోరు 25 కాగా.. షమీ వేసిన ఐదో ఓవర్‌లో గిల్ రెచ్చిపోయాడు. వరుసగా 4, 6, 4, 4 బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో 5 ఓవర్లకు గుజరాత్ స్కోరు 45కి చేరింది. ద్విగేశ్ రాఠీ వేసిన 5.1 ఓవర్‌కు సాయి సుదర్శన్ (15) ఔటయ్యాడు.
క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్.. గిల్‌కు మంచి సహకారం అందించాడు. దాంతో గుజరాత్ 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో 34 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు బట్లర్ కూడా 29 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. ఈ ఇద్దరు అవుట్ అయ్యాక.. లక్నో రేసులోకి వచ్చింది. అయితే వాషింగ్టన్ సుందర్ (21), రాహుల్ తేవాతియా (10) లక్నోకు అవకాశం ఇవ్వలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. లక్నో తరఫున ఐడెన్ మార్‌క్రమ్ (30) టాప్ స్కోరర్. స్టార్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్ (11), రిషభ్ పంత్ (18), నికోలస్ పూరన్ (19) విఫలమయ్యారు. ఆయుష్ బదోని (9), అబ్దుల్ సమద్ (18) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇనింగ్స్ చివర్లో ముకుల్ చౌదరి (18), జార్జ్ లిండే (16) పరుగులు చేయడంతో లక్నో స్కోరు 160 దాటింది. గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్స్ పడగొట్టి లక్నో నడ్డి విడిచాడు.




