FIFA: ఫుట్‌బాల్ ఆటగాళ్లు చెరిగిన సాక్సులు ఎందుకు వేసుకుంటారో తెలుసా.?

FIFA: ఫుట్‌బాల్ ఆటగాళ్లు మైదానంలో ఆడేటప్పుడు రంధ్రాలు ఉన్న సాక్సులు వేసుకోవడం మీరు ఎప్పుడైనా గమనించారా?

Ravi
By Ravi
Published on: 23 Jun 2026 7:58 AM IST
FIFA
X

FIFA: ఫుట్‌బాల్ ఆటగాళ్లు చెరిగిన సాక్సులు ఎందుకు వేసుకుంటారో తెలుసా.?

FIFA: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో ఫుట్‌బాల్ ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూస్తున్నప్పుడు కొందరు ఆటగాళ్ల కాళ్లకు ఉన్న సాక్సులు చిరిగిపోయి లేదా రంధ్రాలు పడి ఉండటం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంతో ఖరీదైన కిట్స్ వాడే అంతర్జాతీయ ఆటగాళ్లు ఇలా చిరిగిన సాక్సులు ఎందుకు వేసుకుంటారో అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అయితే, ఆటగాళ్లు కావాలనే తమ సాక్సులకు అలా రంధ్రాలు పెట్టుకుంటారని, దీని వెనుక ఒక ముఖ్యమైన ఆరోగ్య, క్రీడా రహస్యం దాగి ఉందని క్రీడా నిపుణులు వివరిస్తున్నారు.

సాధారణంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లు ధరించే సాక్సులు చాలా పొడవుగా ఉండటమే కాకుండా కాళ్లకు ఎంతో టైట్‌గా పట్టుకుని ఉంటాయి. ఇలా సాక్స్ టైట్‌గా ఉండటం వల్ల ఆటగాళ్లు మైదానంలో నిరంతరం పరిగెడుతున్నప్పుడు వారి పిక్క కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికే ఆటగాళ్లు తమ సాక్సుల వెనుక భాగంలో కొన్ని రంధ్రాలు కత్తిరించి పెడతారని నిపుణులు చెబుతున్నారు.

సాక్సులకు ఇలా రంధ్రాలు చేయడం వల్ల ఆటగాళ్ల కాళ్లలో రక్త ప్రసరణ ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతుంది. తద్వారా ఆట మధ్యలో కండరాల నొప్పులు రాకుండా ఉంటాయని, కండరాలకు గాయాలయ్యే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కాళ్లకు గాలి తగిలి ఆటగాళ్లు మరింత సౌకర్యవంతంగా ఆడేందుకు ఈ ట్రిక్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఫుట్‌బాల్ ప్లేయర్లు కావాలనే తమ ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి, గాయాల బారిన పడకుండా ఉండటానికి ఈ రంధ్రాల సాక్సులను వాడుతుంటారని క్రీడాభిమానులు అర్థం చేసుకోవాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story