IND W vs SL W: టాస్ గెలిచినా నో యూజ్.. దుబాయ్‌ పిచ్ రిపోర్ట్ చూస్తే ఇరుజట్లకు టెన్షన్ పక్కా..!

IND W vs SL W: మహిళల ఆసియా కప్ 2026 తుది సమరంలో భారత జట్టు, శ్రీలంక జట్టు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్ పరిస్థితులు, వాతావరణ నివేదిక ఎలా ఉన్నాయో చూద్దాం.

Venkat
Published on: 13 Sept 2026 11:53 AM IST
IND W vs SL W
X

IND W vs SL W: టాస్ గెలిచినా నో యూజ్.. దుబాయ్‌ పిచ్ రిపోర్ట్ చూస్తే ఇరుజట్లకు టెన్షన్ పక్కా..! 

IND W vs SL W: టోర్నీలో ఇప్పటివరకు అపజయమెరుగని భారత్, శ్రీలంక జట్లు టైటిల్ వేటలో తలపడుతున్నాయి. సెమీఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌పై భారత్ గెలవగా, పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్లో అడుగుపెట్టింది.

భారత బ్యాటింగ్ లైనప్‌లో షఫాలీ వర్మ (Shafali Verma) 168 పరుగులు, స్మృతి మంధాన (Smriti Mandhana) 154 పరుగులతో మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ (Deepti Sharma) 11 వికెట్లతో సత్తా చాటుతోంది.

శ్రీలంక సారథి చమరి ఆటపట్టు (Chamari Athapaththu) 11 వికెట్లతో సమష్టిగా రాణిస్తుండగా, హర్షిత సమరవిక్రమ (Harshitha Samarawickrama) బ్యాట్‌తో నిలకడగా ఆడుతోంది. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు ఉండటంతో ఆదివారం రాత్రి జరిగే మ్యాచ్ ఉత్కంఠగా సాగడం ఖాయం.

దుబాయ్ పిచ్ స్వభావం నెమ్మదిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గత రికార్డులను పరిశీలిస్తే ఇక్కడ జరిగిన 31 మహిళల టీ20 మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 16 సార్లు, ఛేదన చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 112 కాగా, రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 86 గా ఉంది.

ఈ పిచ్‌పై స్పిన్నర్ల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటివరకు పడగొట్టిన వికెట్లలో స్పిన్నర్ల వాటా 61.55 శాతంగా ఉండగా, పేసర్లు 38.17 శాతం వికెట్లు దక్కించుకున్నారు. ఆట సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ కష్టంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 14 మ్యాచ్‌లలో 9 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించినందున టాస్ కీలకంగా మారనుంది.

వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్‌కు ఎలాంటి వర్ష సూచన లేదు. ఉష్ణోగ్రత దాదాపు 36 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగుతూ ఆటగాళ్లకు తీవ్రమైన వేడి సవాలు విసరనుంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయి మ్యాచ్ జరిగేందుకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.