Dewald Brevis Injury: సీఎస్‌కేకు వరుస షాకులు.. మరో స్టార్ ప్లేయర్ అవుట్!
Dewald Brevis Injury: ఐపీఎల్ 2026 ఆరంభం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా నాథన్ ఎల్లిస్ టోర్నీ మొత్తానికి దూరమవగా.. ఎంఎస్ ధోనీ రెండు వారాలు దూరమయ్యాడు. తాజాగా మరో స్టార్ ప్లేయర్‌కు గాయం అయినట్లు తెలుస్తోంది.
Dewald Brevis Injury: సీఎస్‌కేకు వరుస షాకులు.. మరో స్టార్ ప్లేయర్ అవుట్!
Dewald Brevis Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఆరంభం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ టోర్నీ మొత్తానికి దూరమవగా.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండు వారాలు దూరమయ్యాడు. తాజాగా మరో స్టార్ ప్లేయర్‌కు గాయం అయినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్ గాయంకు గురైనట్లు తెలుస్తోంది. సైడ్ స్ట్రెయిన్ కారణంగా అతను తొలి రెండు, మూడు మ్యాచ్‌లు మిస్ అవుతాడని సమాచారం. దీనిపై సీఎస్‌కే నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
బ్రెవిస్ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆరు మ్యాచ్‌లలో 225 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. 37.50 సగటుతో పాటు 180 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అలాగే టీ20 ప్రపంచ కప్ 2026లో దక్షిణాఫ్రికా తరఫున 8 మ్యాచ్‌లలో 207 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే సెమీఫైనల్లో న్యూజీలాండ్ చేతిలో ఓడిపోవడంతో సఫారీల కథ ముగిసింది. సీఎస్‌కేకు మరో పెద్ద దెబ్బ ఎంఎస్ ధోనీ గాయం. ట్రైనింగ్ సమయంలో కాళ్ల కండరాలు పట్టేయడంతో ధోనీ కనీసం తొలి రెండు వారాల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాటర్ మహీ లేకపోవడం సీఎస్‌కేకు పెద్ద సమస్యగా మారింది. అయితే ధోనీ జట్టుతో పాటే ఉండి సలహాలు ఇవ్వనుండడం చెన్నైకి సానుకూల అంశం.
గాయపడిన పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ను జట్టులోకి తీసుకున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో ఆడనుంది. ఈ మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జట్టు గత సీజన్‌లోని నిరాశను మరచి మంచి ఆరంభం చేయాలని చూస్తోంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఓపెనింగ్ జోడీగా గైక్వాడ్‌తో పాటు సంజు సాంసన్ ఆడనున్నాడు. రాజస్థాన్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా జట్టులో చేరిన సంజు.. ఈసారి సీఎస్‌కేలో కీలక పాత్ర పోషించనున్నాడు. అన్ని సవాళ్లను అధిగమిస్తూ చెన్నై ఈ సీజన్‌ను విజయవంతంగా ప్రారంభించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
చెన్నై జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, సంజూ శాంసన్, డేవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మ్హత్రే, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, అన్షుయిల్ కాంబోజ్, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మాథ్యూ విలియం షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, ముకేల్ అహ్మద్, శ్రేయాస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, అకేల్ హోసేన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్.




