Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్‌లా మారిన ఢిల్లీ క్రికెటర్.. ఎంత ముద్దుగున్నావే బిధూరి!
Medhavi Bidhuri: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూడీపీఎల్) 2026లో యువ లెగ్ స్పిన్నర్ 'మెధావి బిధూరి' ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్‌లా మారిన ఢిల్లీ క్రికెటర్.. ఎంత ముద్దుగున్నావే బిధూరి!
Medhavi Bidhuri: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూడీపీఎల్) 2026లో యువ లెగ్ స్పిన్నర్ 'మెధావి బిధూరి' ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వికెట్ తీసిన అనంతరం ఆమె చేసిన ‘6-7’ సెలబ్రేషన్ నెట్టింట వైరల్‌గా మారింది. సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ తరఫున ఆడుతున్న బిధూరి.. డబ్ల్యూడీపీఎల్ 2026 టోర్నీ తొలి మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ బ్యాటర్ నిషికా సింగ్‌ను ఔట్ చేసిన అనంతరం ఈ వెరైటీ సెలబ్రేషన్ చేసింది. దాంతో ఆమె వైరల్ కాగా.. వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో మెధావి బిధూరి బౌలింగ్‌లో నిషికా సింగ్ అవుట్ అయింది. మిడ్ వికెట్ వద్ద అరుషి గోయల్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో.. మెధావి ఖాతాలో వికెట్ చేరింది. వెంటనే బిధూరి తన చేతులతో జెన్-జీ తరంలో ట్రెండింగ్‌లో ఉన్న '6-7' సెలబ్రేషన్ చేసుకుంది. జెన్-జీ 6-7 సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆరు-ఏడు అని చెబుతూ.. చేతులు పైకి కిందకీ ఊపుతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో యువ క్రికెటర్‌పై అందరి దృష్టి పడింది. మాజీ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ 6-7 సెలబ్రేషన్స్‌ను ఇప్పటికే చేసుకున్నారు.
మెధావి బిధూరి సెలబ్రేషన్‌కు ఆమె ధరించిన జెర్సీ నంబర్ 67కు ఓ సంబంధం ఉంది. నిజానికి డబ్ల్యూడీపీఎల్ 2026 టోర్నీలో 12వ నంబర్ జెర్సీని ధరించాలని ఆమె అనుకుంది. అయితే ఆ నంబర్ అప్పటికే మరొకరికి కేటాయించడంతో.. 67వ నంబర్‌ను ఎంచుకుంది. బిధూరి తన సోదరి సూచనతో అదే ‘6-7’ను వికెట్ సెలబ్రేషన్‌గా మార్చుకుంది. బిధూరి ఢిల్లీ దేశవాళీ క్రికెట్లో కొంతకాలంగా ఆడుతోంది. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన ఆమె ఢిల్లీ అండర్-19 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనూ తన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో బిధూరి దేశవాళీ స్థాయిలో క్రమంగా తన ప్రతిభను చాటుకుంటోంది.
2025 ఢిల్లీ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో మెధావి బిధూరి సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ జట్టులో ఆడారు. సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్‌తో జరిగిన ఫైనల్లో ఆమె అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసింది. మూడు వికెట్లు పడగొట్టి 26 పరుగులు మాత్రమే ఇచ్చింది. అయితే ఆ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. బిధూరి ప్రతిభకు అప్పుడే గుర్తింపు దక్కింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2024 వేలంలో కూడా ఆమె పేరు వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మంచి ప్రదర్శనలు చేస్తూ ముందుకు దూసుకెళుతోంది.
మెధావి బిధూరి చేసిన ‘6-7’ సెలబ్రేషన్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కూడా ఫాలో అయ్యాడు. ఇంగ్లాండ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడుతున్న చహల్.. లాంకషైర్ బ్యాటర్ జో మూర్స్‌ను ఔట్ చేసిన అనంతరం బిధూరి తరహాలోనే ‘6-7’ సంజ్ఞతో సెలబ్రేట్ చేశాడు. దీంతో బిధూరి పేరు సోషల్ మీడియాలో మార్మోగింది. ఓ వికెట్ తర్వాత చేసిన సరదా సెలబ్రేషన్‌తో మొదలైన ఈ వైరల్ మూమెంట్.. ఇప్పుడు ఆమె క్రికెట్ ప్రయాణంపై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. దేశవాళీ క్రికెట్‌లో తన బౌలింగ్‌తో మరింతగా రాణిస్తే.. భవిష్యత్తులో మెధావి టీమిండియాలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.




