DC vs MI: టాప్ స్టార్ల విఫలం.. మోస్తరు స్కోరుకే పరిమితమైన ముంబై, ఢిల్లీ గెలిచినా?

DC vs MI: అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ముంబై, ఢిల్లీ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది.

Rishvik
Published on: 4 April 2026 5:48 PM IST
DC vs MI
X

DC vs MI: టాప్ స్టార్ల విఫలం.. మోస్తరు స్కోరుకే పరిమితమైన ముంబై, ఢిల్లీ గెలిచినా?

DC vs MI: ఐపీఎల్‌ 2026లో మ‌రో హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ (51; 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్‌ శర్మ (35), నమన్‌ ధీర్‌ (28) రన్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ముకేశ్ కుమార్ 2 వికెట్స్ తీయగా.. ఎంగిడి, అక్షర్, నటరాజన్ తలో వికెట్ తీశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియ‌న్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ త్వరగానే అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో 9 రన్స్ చేసి ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ (0)ను రిటర్న్‌ క్యాచ్‌తో ముకేశ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో ముంబై మూడో ఓవర్‌లో రెండు టాప్ స్టార్లను కోల్పోయింది. ఈ సమయంలో జట్టును రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాద‌వ్ ఆదుకున్నారు. హిట్టర్లు అయిన ఈ ఇద్దరు స్లోగా ఆడడంతో ముంబై రన్ రేట్ తగ్గింది. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు 41/2గా ఉంది. సూర్య-రోహిత్ జోడి కాస్త దూకుడు పెంచారు. ధాటిగా ఆడే క్రమంలో 9.3 ఓవర్‌లో అక్షర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔట్‌ అయ్యాడు. 10 ఓవర్లకు ముంబై మూడు వికెట్ల నష్టానికి 73 రన్స్ చేసింది.

12వ ఓవర్‌లో విప్రాజ్‌ బౌలింగ్‌లో హిట్టర్ రుథర్‌ఫోర్డ్‌ (5) పెవిలియన్ చేరాడు. ఢిల్లీ బ్యాటర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 14 ఓవర్లకు ముంబై స్కోరు 100 దాటింది. 35 బంతుల్లో అర్ధ శతకం బాదిన సూర్య.. 15.3 ఓవర్‌లో ఎంగిడి బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ సమయంలో శాంట్నర్‌ (18), నమన్‌ ధీర్‌ కాస్త దూకుడుగా ఆడారు. 19వ ఓవర్లో నటరాజన్‌ బౌలింగ్‌లో నమన్‌ అవుట్ కాగా.. చివర్లో బాష్‌ (11 నాటౌట్) పరుగులు చేయడంతో ముంబై స్కోర్ 160 దాటింది. ఢిల్లీ విజయానికి 120 బంతుల్లో 163 పరుగులు అవసరం. టాప్ బ్యాటర్లు ఉన్న ఢిల్లీ ఈ లక్షాన్ని ఛేదిస్తుందో లేదో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story