DC vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. తుది జట్లు, ఇంపాక్ట్ ప్లేయర్స్ వీరే!
DC vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కీలక మ్యాచ్‌లో తలపడుతున్నాయి.
DC vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. తుది జట్లు, ఇంపాక్ట్ ప్లేయర్స్ వీరే!
DC vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కీలక మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో జరుగుతోంది. ప్లేఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠభరితంగా మారుతున్న నేపథ్యంలో ఇరు జట్లకూ ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకునాన్డు. పిచ్ బాగా కనిపిస్తోందని, రెండో ఇన్నింగ్స్‌లో కొంత స్లో అవుతుందని భావించి బ్యాటింగ్ తీసుకున్నామని చెప్పాడు.
ముందుగా భారీ పరుగులు చేసి బౌలర్లకు సహాయం కల్పించాలని అనుకున్నట్లు అక్షర్ పటేల్ తెలిపాడు. జట్టు ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నప్పటికీ.. ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తాము బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని అన్నాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో జట్టు ప్రదర్శన మెరుగుపడిందని, ముఖ్యంగా బౌలింగ్ యూనిట్ బాగా రాణిస్తోందని చెప్పాడు. యువ ఆటగాళ్లు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారని, ఇది ఫ్రాంచైజీకి మంచి సూచన అని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు కొన్ని మార్పులతో బరిలోకి దిగాయి. సీఎస్కే జట్టులో అకీల్ హోసేన్, గుర్జప్నీత్ సింగ్‌లకు అవకాశం లభించగా.. ఢిల్లీ జట్టులో లుంగి ఎంగిడి జమీసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. స్టార్ ఆటగాళ్లతో నిండిన ఈ మ్యాచ్ అభిమానులకు మంచి ఉత్కంఠను అందించనుంది. ప్లేఆఫ్స్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్ల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. అందుకే ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, అకేల్ హొసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాథమ్ నిశాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీశ్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
చెన్నై: శివమ్ దూబె, ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, ఆకాశ్ మధ్వల్, సర్ఫరాజ్ ఖాన్.
ఢిల్లీ: విప్రజ్ నిగమ్, సమీర్ రిజ్వీ, అభిషేక్ పోరెల్, అకిబ్ నబీ దార్, డేవిడ్ మిల్లర్.




