Bhuvneshwar Kumar: 15 ఏళ్ల కుర్రాడు ఇలా చితక్కొడుతాడనుకోలేదు.. వైభవ్‌ది అల్లాటప్పా బ్యాటింగ్ కాదు!

Bhuvneshwar Kumar praises Vaibhav Sooryavanshi fearless batting. ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను కొనియాడాడు. ఈ సీజన్‌లో భువనేశ్వర్ మాత్రమే కాదు.. బుమ్రా, హేజిల్‌వుడ్‌ లాంటి టాప్ బౌలర్లను కూడా చితకొట్టాడు.

Rishvik
Published on: 11 April 2026 12:21 PM IST
Bhuvneshwar Kumar
X

Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. శుక్రవారం బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను చితక బాదాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 300 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఈ ఇన్నింగ్స్ మ్యాచ్ దిశనే మార్చేసింది. వైభవ్ దూకుడుతో రాజస్థాన్ మరో రెండు ఓవర్లు ఉండగానే 200+ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను కొనియాడాడు. పవర్‌ప్లేలో భువీ రెండు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదిన వైభవ్.. ఐదో ఓవర్‌లో వరుసగా సిక్సులు, ఫోర్లతో 17 పరుగులు సాధించి కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో భువనేశ్వర్ మాత్రమే కాదు.. జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్‌ లాంటి టాప్ బౌలర్లddను కూడా చితకొట్టాడు. ముంబైపై మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో 5 బంతుల్లో 13 పరుగులు చేయగా.. అందులో రెండు సిక్సులు ఉన్నాయి. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 19 పరుగులు సాధించి తన దూకుడును చాటుకున్నాడు.

'ఇది టీ20 ఫార్మాట్. వైభవ్ సూర్యవంశీ చిన్నవాడే అయినా అద్భుతంగా ఆడుతున్నాడు. చాలా పరిణతి చూపించాడు. వైభవ్ మా బౌలింగ్‌లో ఇలా చితక్కొడుతున్నాడని అనుకోలేదు. 15 ఏళ్ల వయసులో ఇలా ఆడటం గొప్ప విషయం. ఇక్కడ ఎవరినీ తక్కువగా అంచనా వేయం. మా ప్లాన్‌లను సరిగ్గా అమలు చేయలేకపోయాం. టీ20లో గెలుపోటములు భాగమే, పెద్దగా ఆందోళన అవసరం లేదు. విజయం కోసం మేము మా వంతు ప్రయత్నం చేశాం. ఫాస్ట్ బౌలర్లు విభిన్నంగా బౌలింగ్ చేశారు. కానీ వైభవ్ మంచి షాట్లు ఆడాడు. పవర్‌ప్లేలో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం కష్టం. మాకు ఒకే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉండడంతో ఆప్షన్లు ఎక్కువగా లేవు. అందుకే మేము చేయగలిగింది చేశాం' అని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.

వైభవ్ బ్యాటింగ్ స్టైల్‌పై భువీ ప్రశంసలు కురిపించాడు. 'వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను తక్కువ చేయడానికి లేదు. అతడు సరైన క్రికెట్ షాట్లు ఆడుతున్నాడు. 15 ఏళ్ల వయసులో ఇంత మెచ్యూరిటీ చాలా అరుదు. రాజస్థాన్ విజయంలో అతడికే పూర్తి క్రెడిట్ ఇవ్వాలి' అని కొనియాడాడు. వైభవ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ముగిసింది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో లాంగ్ ఆన్ వైపు షాట్ ఆడగా.. విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్ పట్టాడు. అవుట్ అయ్యి తిరిగి వెళ్తుండగా స్టేడియంలో ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు నిలబడి అభినందనలు తెలియజేయడం అతని ఇన్నింగ్స్ ఎంత విలువైందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి వైభవ్ తన ప్రతిభతోనే కాదు, మెచ్యూరిటీతో కూడా క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story