ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యాడు.. కట్‌చేస్తే.. రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ.. ఎందుకంటే?
BCCI: ఆస్ట్రేలియాతో జరిగే అండర్-19 సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ రోహిత్ యాదవ్‌కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది.
ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యాడు.. కట్‌చేస్తే.. రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ.. ఎందుకంటే?
BCCI: ఆస్ట్రేలియాతో జరిగే అండర్-19 సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ రోహిత్ యాదవ్‌కు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. వయసు ధ్రువీకరణ పత్రాల్లో వ్యత్యాసాలు గుర్తించడంతో అతడిపై తక్షణమే రెండేళ్ల నిషేధం విధించింది. ఈ కాలంలో బీసీసీఐకి అనుబంధంగా జరిగే ఎలాంటి క్రికెట్‌లోనూ అతడు పాల్గొనలేడు. రాష్ట్ర క్రికెట్ సంఘాలకూ ఈ నిర్ణయాన్ని తెలియజేసినట్లు సమాచారం.
పత్రాల్లో వయసు తేడా..
బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ యాదవ్ వయసు విషయంలో పలు అనుమానాలు తలెత్తాయి. బెంగాల్ క్రికెట్ సంఘం (CAB)లో 2014లో నమోదు చేసిన సమయంలో అతడి పుట్టిన తేదీ 2007 జులై 7గా ఉంది. ఆ సమయంలో చిరునామా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు నమోదైంది.
అయితే 2017లో ఆధార్ వివరాలను మార్చినప్పుడు పుట్టిన సంవత్సరం 2006గా నమోదైంది. 2020లోనూ అదే కొనసాగింది. ఆ తర్వాత 2021లో మరోసారి వివరాలు మారి పుట్టిన సంవత్సరం 2009గా నమోదైంది. 2022, 2023, 2024లో చేసిన ఆధార్ నవీకరణల్లోనూ 2009 సంవత్సరమే కొనసాగింది. దీంతో రికార్డుల్లోని వ్యత్యాసాలపై అధికారులు దృష్టి సారించారు.
బీసీసీఐ ఆదేశాలతో విచారణ..
యువ క్రికెటర్ల వయసు ధ్రువీకరణలో భాగంగా CAB ఈ ఏడాది పత్రాలను పరిశీలించింది. రోహిత్ యాదవ్ సమర్పించిన రికార్డుల్లో తేడాలు కనిపించడంతో వివరణ కోరింది. అనంతరం విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లింది. పరిశీలన తర్వాత వయసు మోసానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనగా భావించిన బీసీసీఐ.. రెండేళ్ల నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా సిరీస్ నుంచి ఉద్వాసన..
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో రోహిత్ యాదవ్ పేరు ఉంది. వన్డే, మల్టీడే మ్యాచ్‌ల కోసం ఎంపికైన జట్లలోనూ అతడికి చోటు దక్కింది. అయితే నిషేధం నేపథ్యంలో ఇప్పుడు అతడు ఆ సిరీస్‌కు దూరం కానున్నాడు.
ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ రోహిత్ భారత అండర్-19 జట్టులో భాగమయ్యాడు. అక్కడ జరిగిన యూత్ టెస్టులో లెగ్‌స్పిన్నర్‌గా సత్తా చాటి 6 వికెట్లు పడగొట్టాడు. వికెట్‌కు సగటున 10.50 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో అతడి కెరీర్ మంచి దిశలో సాగుతున్న సమయంలో ఈ పరిణామం ఎదురైంది.
రోహిత్ స్థానంలో ఎవరికి ఛాన్స్..?
రెండేళ్ల నిషేధం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ నుంచి రోహిత్ తప్పుకోవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కనిష్ఠ్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్ పేర్లు ప్రత్యామ్నాయాలుగా వినిపిస్తున్నాయి.
ఇక ఆస్ట్రేలియాతో భారత్ అండర్-19 సిరీస్ నేపథ్యంలోనే బీసీసీఐ యువ ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అయితే వయసు విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న బోర్డు.. రికార్డుల్లో వ్యత్యాసాలు కనిపిస్తే చర్యలకు వెనుకాడటం లేదనే సంకేతాన్ని రోహిత్ యాదవ్ ఉదంతం స్పష్టం చేస్తోంది.




