Cricket: మహిళా క్రికెట్ జట్టులో బయటపడ్డ ఎఫైర్.. టీమ్‌మేట్‌తో ఆ ప్లేయర్‌తో సంబంధం

Cricket: భార్య మోనికా రైట్‌తో విడాకులు, టీమ్‌మేట్ జార్జియా వోల్‌తో కొత్త సంబంధంపై ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ ఎట్టకేలకు స్పందించారు.

Naresh.k
Published on: 14 Aug 2026 11:33 AM IST
Cricket
X

Cricket: మహిళా క్రికెట్ జట్టులో బయటపడ్డ ఎఫైర్.. టీమ్‌మేట్‌తో ఆ ప్లేయర్‌తో సంబంధం

Cricket Australia: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో చెలరేగిన వ్యక్తిగత వివాదం ప్రపంచ క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆసీస్ వైస్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తన భార్య మోనికా రైట్‌‌తో విడిపోవడం, అలాగే సహచర ఆటగాడు జార్జియా వోల్‌తో ఎఫైర్ ఉందనే వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన గార్డనర్, ఈ వ్యవహారంపై కీలక ప్రకటన చేస్తూ బోర్డు వైఖరిని కూడా స్పష్టం చేశారు.

మోనికా రైట్‌తో తన వివాహ బంధం ముగియడం పూర్తిగా తన వ్యక్తిగత విషయమని గార్డనర్ స్పష్టం చేశారు. అయితే, జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నందున తన బాధ్యతను గుర్తుంచుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. నా వ్యక్తిగత జీవితం ముగిసిపోవడం బాధాకరమే. కానీ, జాతీయ జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను. అందుకే నా టీమ్‌మేట్ జార్జియా వోల్‌తో ఉన్న కొత్త సంబంధం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా యాజమాన్యానికి ముందే స్పష్టంగా తెలియజేశాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు అండగా నిలిచినందుకు క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు అని గార్డనర్ వెల్లడించారు.

అంతకుముందు, గార్డనర్ భార్య మోనికా రైట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగుతున్న సమయంలోనే గార్డనర్ తనను మోసం చేసిందని, సహచర క్రికెటర్ జార్జియా వోల్‌తో ఎఫైర్ పెట్టుకుని తమ వైవాహిక జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. ఇంత పెద్ద వివాదం నడుస్తున్నప్పటికీ, గార్డనర్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా ఆమెను వైస్ కెప్టెన్‌గా కొనసాగించడంపై క్రికెట్ ఆస్ట్రేలియాను మోనికా బహిరంగంగా విమర్శించారు.

ఈ తీవ్ర వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. ఆష్లీ గార్డనర్ ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్‌గానే బాధ్యతలు నిర్వర్తిస్తారు. జట్టు ఎంపిక విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేందుకు.. జార్జియా వోల్ సెలక్షన్, రివ్యూలకు సంబంధించిన నిర్ణయాత్మక సమావేశాల నుంచి గార్డనర్‌ను పూర్తిగా దూరంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలోని వివాదాలు ఒకవైపు, మైదానంలో ఆసీస్ జట్టు నాయకత్వ బాధ్యతలు మరొకవైపు ఉండటంతో.. రాబోయే రోజుల్లో గార్డనర్ ఆటతీరు, జట్టు వాతావరణం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story