Arjun Tendulkar: ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం.. పంజాబ్ పై చెలరేగేనా?
Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లక్నో తరఫున ఆడుతున్నాడు.
Arjun Tendulkar: ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం.. పంజాబ్ పై చెలరేగేనా?
Arjun Tendulkar: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా లక్నో బ్యాటింగ్ చేస్తోంది. ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైషాక్ జట్టులోకి వచ్చారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లక్నో తరఫున ఆడుతున్నాడు. అర్షిన్ కులకర్ణి స్థానంలో అర్జున్ తుది జట్టులోకి వచ్చాడు. మరి కింగ్స్‌పై అర్జున్ ఎలా ఆడుతాడో చూడాలి?.
టాస్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. 'మేము మొదట బౌలింగ్ చేయబోతున్నాం. జట్టులో రెండు మార్పులు చేశాం. మార్కో (జాన్సన్), వైశాఖ్ (విజయ్‌కుమార్) జట్టులోకి వచ్చారు. ఇది మాకు డూ ఆర్ డై మ్యాచ్. కానీ మేము డూ వైపు మాత్రమే చూస్తున్నాం. పట్టికలో ఇలాంటి పరిస్థితిని మేము ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోలేదు. జట్టులోని ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రోజు చివరిలో ఫలితం ఎలా ఉంటుందో చూడటానికి వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు' అని తెలిపాడు.
మరోవైపు లక్నో సారథి మాట్లాడుతూ.. కూడా తాము ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమేనని చెప్పాడు. 'ఈ పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంది. హై స్కోరింగ్ మ్యాచ్ కావచ్చు. మా జట్టులో రెండు మార్పులు చేశాం. అర్జున్ టెండూల్కర్, అర్షిన్ కులకర్ణికి అవకాశం ఇచ్చాం' అని వెల్లడించాడు. 'మా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. యూపీ నలుమూలల నుంచి వచ్చి మాకు మద్దతుగా నిలిచారు. ఈ సీజన్ మాకు ఎన్నో పాఠాలు నేర్పింది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో వంద శాతం గెలిచేందుకు కృషి చేస్తాం' అని అన్నాడు. ప్లేఆఫ్స్ రేసు దృష్ట్యా పంజాబ్ కింగ్స్ తప్పక గెలవాల్సిఉంది. దాంతో ఈ పోరు ఉత్కంఠభరితంగా మారే అవకాశముంది.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: జోష్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషభ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్సిన్ ఖాన్.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానెల్లీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షిడ్జే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు:
పంజాబ్: హర్ప్రీత్ బ్రార్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబె.
లక్నో: షెహబాజ్ అహ్మద్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, మణిమారన్ సిద్ధార్థ్, హిమ్మత్ సింగ్, ఆకాశ్ మహరాజ్ సింగ్.




