Banana Leaf: ఓస్‌ ఇంతేనా అనుకోవద్దు...పూర్వీకులు ఎందుకు చెప్పారో చూడండి

అరటి ఆకులో భోజనం చేయడం ఆరోగ్యం మాత్రమే కాదు...తిన్న తరువాత ఆకును లోపలికి మడవాలి. ఇలా మడవటం వలన పశువులు వీటిని తీసుకొని ఆరోగ్యంగా ఉంటాయి.

Balachander
Published on: 11 July 2026 3:57 PM IST
Banana Leaf: ఓస్‌ ఇంతేనా అనుకోవద్దు...పూర్వీకులు ఎందుకు చెప్పారో చూడండి
X

Banana Leaf: పూర్వకాలం నుండి నేటి వరకు దేవాలయాల ప్రసాద వితరణలో, పవిత్రమైన శుభకార్యాలలో అరిటాకు లేదా విస్తరాకులో భోజనం వడ్డించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇప్పుడంటే ప్లాస్టిక్, స్టీల్ కంచాలు వచ్చాయి కానీ, అరిటాకులో భోజనానికి ఉన్న తృప్తే వేరు. అయితే భోజనం పూర్తయిన తర్వాత ఆకును పైకి కాకుండా, మన వైపునకే అంటే లోపలికి మడతపెట్టడం వెనుక మన పెద్దలు ఎంతో లోతైన ఆధ్యాత్మిక, సైంటిఫిక్ కారణాలను చెప్పారు. ఆకును లోపలికి మడవడమనే ఈ చిన్న అలవాటు వెనుక ఉన్న మూడు అద్భుత రహస్యాలు ఇప్పుడు చూద్దాం.

వడ్డించిన ఇల్లాలు, అన్నదాతకు ఇచ్చే గౌరవం

భోజనం ముగిశాక విస్తరాకును లోపలి వైపునకు మడవడం అంటే... "మీరు వడ్డించిన అన్న ప్రసాదం ఎంతో అద్భుతంగా ఉంది, నా కడుపు నిండింది" అని ఆ అన్నదాతకు, వండిన ఇల్లాలుకు కృతజ్ఞత తెలపడం. ఇది ఎదుటివారి శ్రమను గౌరవించే ఒక గొప్ప సంస్కారం. అయితే, శ్రాద్ధ కర్మలు లేదా అశుభ కార్యాలలో మాత్రమే ఆకును బయటి వైపునకు మడుస్తారు.

సూర్యరశ్మి పడకుండా ఆహార సంరక్షణ

పూర్వకాలంలో భోజనాలు అయ్యాక ఆకులను చెట్ల కింద పడేసేవారు. తిన్న ఆకును లోపలికి మడవడం వల్ల అందులో మిగిలిపోయిన అన్నంపై సూర్యరశ్మి నేరుగా పడదు. దీనివల్ల ఆకులోని మిగిలిన పదార్థాలు త్వరగా పాడవకుండా, కుళ్లిపోకుండా ఉంటాయి.

గోమాత ... మూగజీవాల ఆరోగ్యం

విస్తరాకును లోపలికి మడవడం వల్ల మరో పెద్ద ప్రయోజనం ఉంది. ఎండ తగలకుండా కాపాడటం వల్ల ఆకులోని మిగిలిన అన్నం కొంతసమయం వరకు తాజాగా ఉంటుంది. ఆ ఆకులను పశువులు, ముఖ్యంగా గోమాతలు తిన్నప్పుడు వాటి ఆరోగ్యం దెబ్బతినదు. పశువులు కూడా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయనే దయాగుణంతో మన పూర్వీకులు ఈ నియమాన్ని తెచ్చారు. మన పూర్వీకులు చెప్పిన ప్రతి చిన్న ఆచారంలోనూ ఎంతో జీవకారుణ్యం, లౌకిక జ్ఞానం దాగి ఉన్నాయి! కేవలం ఒక ఆకును మడిచే విధానంలోనే అన్నదాతకు గౌరవం, మూగజీవాల పట్ల ప్రేమను చూపించడం మన సనాతన ధర్మానికే సాధ్యం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story