Varahi Temple: కళ్లజోడు అక్కర్లేదు...వారాహిమాత ఇచ్చే ఈ నీళ్లు చాలు

కళ్లద్దాల అవసరం లేకుండా, కేవలం అమ్మవారి పాదాల చెంత లభించే పవిత్ర జలంతో కంటి చూపు మెరుగుపడుతుందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

Balachander
Published on: 29 April 2026 3:03 PM IST
Varahi Temple:  కళ్లజోడు అక్కర్లేదు...వారాహిమాత ఇచ్చే ఈ నీళ్లు చాలు
X

Varahi Temple Miracle Water: కళ్లద్దాల అవసరం లేకుండా, కేవలం అమ్మవారి పాదాల చెంత లభించే పవిత్ర జలంతో కంటి చూపు మెరుగుపడుతుందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో కొలువై ఉన్న మా బరాహీ (వారాహి) దేవి ఆలయం ఇటువంటి అద్భుతాలకే నిలయం. ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, వేలాది మంది భక్తుల కంటి వెలుగును కాపాడే ఒక ఆధ్యాత్మిక చికిత్సాలయంగా కూడా ప్రసిద్ది చెందింది.

కంటి చూపును ప్రసాదించే ఉత్తరీ భవానీ- వారాహి మాత క్షేత్ర మహిమ

పూర్వాంచల్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సిద్ధ శక్తిపీఠంగా వెలుగొందుతున్న ఈ ఆలయానికి "ఉత్తరీ భవానీ" అని మరోపేరు. దీనికి కారణం తూర్పున కామాఖ్య, పశ్చిమాన హింగ్లాజ్ మాత ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నారో, ఉత్తర భారత దేశంలో ఈ బరాహీ దేవి అంతటి శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. ఏడాది పొడుగున వారాహి మాతను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

ఆధ్యాత్మిక అద్భుతం - ఆ పవిత్ర జలమే మందు

ఈ ఆలయ ప్రాంగణంలో ఒక సహజసిద్ధమైన గుహ ఉంటుంది. ఆ గుహ నుంచి నిరంతరం ప్రవహించే పవిత్ర జలాన్ని కళ్ళకు అద్దుకుంటే, కంటికి సంబంధించిన సకల వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో కాలంగా కంటి చూపు మందగించిన వారు, కళ్లద్దాలు వాడుతున్న వారు సైతం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని, ఆ నీటిని స్పృశించాక తమ చూపు మెరుగుపడిందని ఆనందంగా చెబుతుంటారు. ఇలాంటి అనుభవాలు ఎందరికో ఉన్నాయి. మహిమాన్వితమైన నీటిని కళ్లకు అద్దుకోవడంతో పాటు సేవించడం వలన దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

వరాహ అవతార సంబంధం

పురాణాల ప్రకారం, ఈ తల్లి శ్రీమహావిష్ణువు యొక్క వరాహ అవతారానికి శక్తి స్వరూపం. ప్రాచీన కాలం నుండి ఎందరో మహర్షులు ఇక్కడ తపస్సు చేసి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. అందుకే ఈ ప్రాంతంలో నిరంతరం అనుకూల శక్తులు ప్రవహిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ నవరాత్రుల సమయంలో ఇక్కడ జరిగే పూజలు అత్యంత విశేషమైనవి. సైన్స్ దీనికి ఆధారాలు చూపలేకపోయినా, వేల సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు భక్తుల నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే శ్రద్దా భక్తులతో అమ్మవారిని వేడుకుంటే చీకటిమయమైన జీవితాల్లో జ్ఞానమనే వెలుగుతో పాటుగా, కంటిచూపు అనే వరప్రసాదాన్ని కూడా ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. ఉత్తరప్రదేశ్‌ను సందర్శించే భక్తులు తప్పకుండా వారాహిమాతను కూడా సందర్శించి అమ్మవారి కృపను పొందండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story