Thursday Pradosham Remedy: గురువారం ప్రదోషసమయం పూర్తయ్యేలోపు ఇలా చేయండి...లక్ష్మీకుబేరులకు మీ ఇల్లే ఆహ్వానమౌతుంది
గురువారం ప్రదోష సమయంలో కర్పూరం, లవంగాలతో చేసే సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలు లక్ష్మీకుబేర అనుగ్రహాన్ని కలిగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వాస్తు దోష నివారణ, ధనలాభం, శని-రాహు కేతు దోష నివారణకు ఇలాంటి పరిహారాలు శుభకరం.
Thursday Pradosham Remedy: హిందూ సనాతన ధర్మంలో పూజ అనగానే మనకు మొదట గుర్తుకువచ్చేది పరమ పవిత్రమైన కర్పూర హారతి. గురువారం ప్రదోష సమయం (సాయంత్రం 4:30 నుండి 6:00 గంటల మధ్య) ముగిసేలోపు కర్పూరంతో కొన్ని చిన్న పరిహారాలు చేస్తే, మీ ఇల్లే లక్ష్మీకుబేరులకు నిలయంగా మారుతుంది. కర్పూరం కేవలం హారతి ఇవ్వడానికే కాదు... ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని నశింపజేసి, అష్టైశ్వర్యాలను ఆకర్షించే అద్భుతమైన దివ్యౌషధమని పండితులు చెబుతున్నారు.
కర్పూరం ... లవంగాల దైవిక శక్తి
శాస్త్రాల ప్రకారం, కర్పూరం నుంచి వెలువడే సువాసన దుష్టశక్తులను, చేతబడులను సమూలంగా నాశనం చేస్తుంది. సోమవారం నాడు మహాశివుని ముందు కర్పూరంతో పాటు 2 లవంగాలను కలిపి వెలిగించి, "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్..." అనే మహామృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే జాతకంలోని శని, రాహు-కేతు దోషాలు నశిస్తాయి. ఒక చిన్న వెండి లేదా రాగి గిన్నెలో 4 కర్పూరం బిళ్లలను ఉంచి, మీ వ్యాపార స్థలంలో లేదా ఇంట్లోని బీరువాలో ఉంచడం వల్ల లక్ష్మీకటాక్షం లభిస్తుంది. మీ పర్సులో ఎల్లప్పుడూ ఒక చిన్న కర్పూరం ముక్కను ఉంచుకుంటే వృధా ఖర్చులు తగ్గి, చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది.
వాస్తు దోష నివారణకు ఆవుపిడక పరిహారం
ప్రతిరోజూ సాయంత్రం వేళ ఒక ఆవుపిడకపై 4 లేదా 5 కర్పూరం ముద్దలను ఉంచి వెలిగించి, ఆ పొగను ఇల్లంతా చూపించాలి. ఈ బలమైన సువాసన వల్ల ఇంట్లో దాగిన తీవ్రమైన వాస్తు దోషాలు తొలగిపోతాయి. కర్పూరం కాలినప్పుడు బూడిద మిగలదు. అది మన అహంకారాన్ని కరిగించి, భగవంతునిలో లీనం కావాలనే తత్వానికి ప్రతీక. ఏకాదశి గురువారంతో కలిసి వచ్చిన ఈరోజున ప్రదోష సమయం ముగిసేలోగా ఇంట్లో కర్పూరంతో దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీకుబేర యోగం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఆవుపిడలకలపై కర్పూరాన్ని ప్రదోషంలో వెలిగించండి. లేదా... తులసిమొక్క వద్ద ఆవునెయ్యితో దీపం వెలిగించినా సరిపోతుందని పండితులు చెబుతున్నారు.




