Anantha Rama Sharma: ఇంట్లో ఐశ్వర్యం తాండవించాలంటే శ్రావణమాసంలో ఇలా చేయండి!
Anantha Rama Sharma: శ్రావణమాసంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, ఇల్లు లక్ష్మీప్రదం కావడానికి అనుసరించాల్సిన పద్ధతులపై ప్రముఖ పండితులు అనంతరామ శర్మ వివరణ ఇచ్చారు.
Anantha Rama Sharma: ఇంట్లో ఐశ్వర్యం తాండవించాలంటే శ్రావణమాసంలో ఇలా చేయండి!
Anantha Rama Sharma: కార్తీక మాసం తరహాలోనే శ్రావణమాసం కూడా అత్యంత పవిత్రమైనదని, ఈ మాసంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల ఇల్లు సకల శుభాలతో కలకలలాడుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు అనంతరామ శర్మ తెలిపారు. 'hmtv' ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శ్రావణమాస నియమావళిని వివరించారు.
ప్రస్తుత కాలంలో రాత్రిపూటే ఇంటిముందు ఊడ్చుకోవడం, శుభ్రం చేయడం లాంటివి చేస్తున్నారని, అయితే శ్రావణమాసంలో మాత్రం తెల్లవారుజామున (బ్రాహ్మీ ముహూర్తంలో) లేచి ఇంటిముందు ఆవుపేడ (గోమయం)తో కలాపు చల్లి, బియ్యపు పిండితో ముగ్గులు పెట్టాలని సూచించారు. దీనివల్ల లక్ష్మీదేవి స్వయంగా ఇంట అడుగుపెడుతుందని పేర్కొన్నారు.
ఇంట్లో వంటగదిలోని స్టవ్‌ను ప్రతిరోజూ శుభ్రం చేసుకుని, ముగ్గులు పెట్టిన తర్వాతే వెలిగించాలని చెప్పారు. దీనివల్ల అగ్నిదేవుని ఆరాధన జరిగి, ఇంట్లోని వారందరికీ ఆరోగ్యం మరియు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని తెలిపారు.
ఈ శ్రావణమాసంలో ఐదు శుక్రవారాలు రావడం చాలా విశేషమని, ఈ రోజుల్లో లక్ష్మీదేవిని శ్రీసూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధించాలని తెలిపారు. స్తోత్రాలు రానివారు సెల్ ఫోన్లలో లేదా టీవీలలో వింటూ కూడా పూజ చేసుకోవచ్చని శర్మ గారు స్పష్టం చేశారు. అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే జ్ఞానంతో పాటు తర్వాతి తరాలకు కూడా సకల శుభాలు కలుగుతాయని ముగించారు.




