Snake Dreams Meaning: వెంటాడే పాములతో నిద్రపట్టడం లేదా...పెద్దలు చెప్పినట్టు ఈ ఇదే కారణం కావొచ్చు
కలలో పదేపదే పాములు వస్తే దానికి పలు సంకేతాలున్నాయి. వీటిని ఈజీగా తీసుకోకుండా వెంటనే పరిష్కరించుకోవాలని పండితులు చెబుతున్నారు.
Snake Dreams Meaning:కలలో పదే పదే పాములు కనిపిస్తూ నిద్రలో మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయా? పీడకలగా భావించి వదిలేసే ఈ స్వప్నాలు నిజానికి మీ జీవితంలో రాబోయే ఆర్థిక, ఆరోగ్య పరిణామాలకు, జాతకంలో దాగివున్న జ్యోతిష్య హెచ్చరికలకు ప్రధాన సంకేతాలు కావచ్చు! జ్యోతిష్య శాస్త్రం, స్వప్న శాస్త్ర పరిశీలనల ప్రకారం కలలో పాము ఏ స్థితిలో కనిపించింది అనే దానిపైనే మనిషి భవిష్యత్తు, జాతక బలాబలాలు ఆధారపడి ఉంటాయి. కలలో పాము కాటేసినట్లు లేదా మిమ్మల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తే, అది జాతకంలో తీవ్రమైన రాహు-కేతు దోషాలకు సంకేతమని సిద్ధాంతులు స్పష్టం చేస్తున్నారు. ఈ స్వప్నాలు మానసిక ఒత్తిడికి మాత్రమే కాకుండా, శత్రు భయం, ఆరోగ్య సమస్యలకు సూచికలని ప్రముఖ పండితులు విశ్లేషిస్తున్నారు.
పాముల ప్రవర్తన ... జాతకంలో మార్పుల సంకేతాలు
పాము మిమ్మల్ని తరుముతున్నట్లు కల వస్తే, వృత్తి ఉద్యోగాల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా శత్రువులు మీపై కుట్రలు పన్నుతున్నారని అర్థం. అదే విధంగా... కలలో పాము కాటేస్తే రాబోయే రోజుల్లో ఆరోగ్యపరమైన చిక్కులు లేదా అనుకోని ధన నష్టం సంభవించే అవకాశం ఉందని అర్ధం చేసుకోవాలి. ఇక పామును చంపినట్లు కల వస్తే సకల విఘ్నాలపై విజయం సాధించి, కష్టాల నుండి బయటపడతారని సంకేతం. కానీ, పాము కదలకుండా ఒకేచోట ఉంటే, మీరు తీసుకోబోయే నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని హెచ్చరిక అని పండితులు చెబుతున్నారు.
జాతక దోషాలు ... ప్రధాన పరిష్కారం
పదే పదే సర్ప స్వప్నాలు రావడం జాతకంలో కుజ లేదా రాహు-కేతు దోషాలు ఉన్నట్టుగా గుర్తించాలి. దీనికి వెంటనే పరిష్కారాలు చేయించాలి. ప్రతి నెలలో వచ్చే సర్పబలి, కాలసర్ప దోష శాంతి లేదా రాహుకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం వలన ఈ పీడకలల నుండి విముక్తి లభిస్తుంది. స్థిరమైన ప్రశాంతత ప్రాప్తిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ దోషాలు ఎవరికైనా ఉంటే అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి దోషాలను నివారించుకోవడం ఉత్తమం.




