Lakshmi Devi: శ్రావణంలో ఇలాంటి కలలు వస్తున్నాయా... అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినట్టే
శ్రావణంలో కొన్ని రకాలైన కలలు మన అదృష్టాన్ని మారుస్తాయని పండితులు చెబుతున్నారు. ఆ కలలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Lakshmi Devi: పవిత్రమైన శ్రావణ మాసంలో మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం భక్తులు ఎంతో నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు. అయితే, అమ్మవారి దివ్య కృప మనపై కలగబోయే ముందు కొన్ని శుభ సంకేతాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్రావణంలో వచ్చే కొన్ని దివ్యమైన కలలు, ఇంట్లో జరిగే కొన్ని పరిణామాలు త్వరలోనే ఐశ్వర్యం లభించబోతోందనడానికి, లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోందనడానికి స్పష్టమైన సూచనలు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
అమ్మవారి ఆగమనానికి నాలుగు దివ్య శకునాలు
ఈ కలికాలంలో ప్రతి చిన్న అవసరానికి ధనం అత్యంత ప్రధానమైనది. శ్రావణ మాసంలో ప్రతిరోజూ స్నానానంతరం పవిత్రమైన మనస్సుతో లక్ష్మీదేవికి పుష్పాలు, దీపం, నైవేద్యం సమర్పించి ఆరాధించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహానికి సూచనగా కనిపించే నాలుగు శుభ సంకేతాలు ఇవే. లక్ష్మీదేవి దివ్య వాహనమైన గుడ్లగూబ కలలో కనిపిస్తే, త్వరలోనే మీకు ఎదురుచూడని ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని అర్థం. అదేవిధంగా కలలో వికసించిన తామర పువ్వు కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షంతో ఐశ్వర్యం, ప్రశాంతత, అపారమైన విజయం వరిస్తాయి. ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన సమయంలో శంఖం ఊదిన శబ్దం వినిపిస్తే, జీవితంలోని కష్టాలు సమసిపోయి శుభ కాలం రాబోతోందని సంకేతం. అంతేకాదు, గృహంలోకి పిచ్చుక వచ్చి కూర్చోవడం లేదా గూడు కట్టుకోవడం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన శుభ శకునంగా భావిస్తారు. శ్రమ నీది అయితే, జయం జగన్మాతది. కేవలం శుభ కలలు వచ్చాయని ఊరుకోకుండా, మన వంతు కష్టాన్ని నమ్మి ధర్మమార్గంలో పనిచేస్తేనే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. రాబోయే శ్రావణంలో అమ్మవారిని మనసావాచా కర్మణా పూజించి అమ్మవారి కృపాకటాక్షాలను పొందండి. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని ఆరాధించడం వలన శుభఫలితాలు పొందుతారు.




