Sawan Shivratri 2026: ఆగస్టు 11 భద్ర సమయంలో శివపూజ ఎలా చేయాలి... ఈ తప్పులు చేస్తే ఫలితం శూన్యమే

ఆగస్టు 11 ఉత్తరాదివారికి శ్రావణ సోమవారం అయింది. అదే రోజున భద్ర కాలం ఉండటంతో శివలింగానికి అభిషేకం చేయవచ్చా అనే సందేహాలు ఉంటాయి. వాటికి సమాధానాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 10 Aug 2026 10:16 AM IST
Sawan Shivratri 2026: ఆగస్టు 11 భద్ర సమయంలో శివపూజ ఎలా చేయాలి... ఈ తప్పులు చేస్తే ఫలితం శూన్యమే
X

Sawan Shivratri 2026: శివాభిషేకానికి భద్రా కాలం అడ్డంకి కాదా... పండితులు చెబుతున్న ధార్మిక నిజాలు ఏమిటి? ఈ పవిత్రమైన నాలుగు ముహూర్తాల్లో మహాశివునికి అభిషేకం చేస్తే కోరికలు నెరవేరుతాయా? పండితులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం.

శివ భక్తులకు అత్యంత పవిత్రమైన మాసం శ్రావణం. ఈ పవిత్ర మాసంలో వచ్చే శ్రావణ శివరాత్రికి (ఉత్తరాది వారికి) ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి వస్తుంది, కానీ శ్రావణ మాసంలో వచ్చే శివరాత్రి శివపార్వతుల పరిపూర్ణ అనుగ్రహాన్ని అందిస్తుంది. 2026 సంవత్సరంలో ఈ పవిత్ర పర్వదినం ఆగస్టు 11న రాబోతోంది. అయితే ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 'భద్రా కాలం' ఉండటంతో భక్తుల్లో పూజ చేయవచ్చా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భద్రా సమయంలో శివపూజ విధానం, ముహూర్తాల వివరాలు తెలుసుకుందాం.

ఆగస్టు 11న భద్రా సమయం ... శివాభిషేకం చేయవచ్చా?

పంచాంగం ప్రకారం శ్రావణ కృష్ణ పక్ష చతుర్దశి తిథి ఆగస్టు 11 ఉదయం 4:43 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 12 రాత్రి 1:51 గంటల వరకు ఉంటుంది. ఆగస్టు 11 ఉదయం నుంచి మధ్యాహ్నం 3:22 గంటల వరకు భద్రా సమయం ఉంది. సాధారణంగా ఈ భద్రా కాలంలో శుభకార్యాలకు దూరంగా ఉంటారు. అయితే, పరమశివుడు సమస్త కాలాలకు, దోషాలకు అతీతుడు (కాలకాలిక). శాస్త్రాల ప్రకారం శివాభిషేకానికి, శివ ఆరాధనకు భద్రా దోషం వర్తించదు. కాబట్టి ఆగస్టు 11న రోజంతా భయపడకుండా శివునికి జలాభిషేకం చేయవచ్చు.

అభిషేకానికి శుభకరమైన ముహూర్తాలు

శ్రావణ శివరాత్రి నాడు ఈ పవిత్ర ముహూర్తాలలో అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఉదయం 5:23 నుండి 6:00 గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం 12:06 నుండి 12:58 గంటల వరకు, రాత్రి 9:13 నుండి 9:32 గంటల వరకు, రాత్రి 12:05 నుండి 12:48 (ఆగస్టు 12) గంటల వరకు అభిషేకం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

పరిపూర్ణ శివపూజా విధానం

శివరాత్రి రోజున ఇంట్లో శివలింగానికి పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేయాలి. అభిషేకం సమయంలో బిల్వపత్రాలు (మారేడు దళాలు), తెల్లటి పువ్వులు, చందనం సమర్పించాలి. పూజ ముగిసాక పండ్లు, తెల్లటి పిండి వంటలను నైవేద్యంగా ఉంచి ధూపదీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వలన మహాదేవుని అనుగ్రహం లభిస్తుంది. అంతకాదు, పూజ చేస్తున్న సమయంలో ఓం నమః శివాయ" "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్" "ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి" వంటి దివ్యమైన మంత్రాలను పఠించడం అత్యంత శుభకరం. ఇక శ్రావణ శివరాత్రి రోజున ఉపవాస జగరణలతో శివుడిని ఆరాధించి, పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేస్తే జాతక దోషాలు తొలగి వివాహ యోగం, శాంతి లభిస్తాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story